జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ దూకుడు పెంచింది.ఇందులో భాగంగా మహారాష్ట్రలోని కాందార్ లోహాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది.
ఈ సభకు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.అనంతరం కేసీఆర్ సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారని సమాచారం.
ఇప్పటికే మహారాష్ట్రలో బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.