ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది.కానీ తమలో ఉన్న ఆ టాలెంట్ ను కొంతమంది మాత్రమే గుర్తించి అందరికి ఆదర్శంగా నిలుస్తారు.
కొంతమంది మాత్రం అవయవాలు అన్ని సరిగా ఉన్నాగాని కష్టపడరు.జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే సంకల్పం, ఆత్మ స్థైర్యం మనలో ఉంటే ఎప్పటికయినా మనం అనుకున్న లక్షాన్ని చేరగలము.
ఈ క్రమంలోనే రెండు కాళ్ళు లేకపోయినా కేవలం తన రెండు చేతులను ఉపయోగించి అత్యంత వేగంగా పరుగెత్తి రికార్డ్ సాధించాడు.అయితే ఆ వ్యక్తి వేగాన్ని లెక్కకట్టిన గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధుల అతనికి అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తిగా రికార్డు బ్రేక్ చేసాడని పొగడ్తలతో ముంచెత్తేసారు.
ప్రస్తుతం ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోను గిన్నిస్ బుక్ రికార్డ్స్ యూట్యూబ్ లో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారే తిని తొంగుంటున్న ఈ కాలంలో పుట్టుకతోనే కాళ్ళు లేని ఈ వ్యక్తి తన చేతులతో అత్యంత వేగంగా పరిగెత్తడం అంటే నిజంగా అభినందించాలిసిన విషయం అనే చెప్పాలి.అసలు ఆ వ్యక్తి ఎవరు.? ఏంటి అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం.అతని పేరు జియోన్ క్లార్క్.
యూఎస్ లో నివాసం ఉంటున్నాడు.దురదృష్టవశాత్తు పుట్టుకతోనే రెండు కాళ్లు లేకుండా పుట్టాడు.
కేవలం రెండు చేతులు మాత్రమే ఉన్నాయి.

జియోన్ అలా పుట్టడానికి కాడల్ రిగ్రెషన్ అనే సిండ్రోమ్ కారణం అంట.ఇది ఒక జెనెటిక్ డిజార్డర్.చాలా అరుదుగా ఇలాంటి వ్యక్తులు పుట్టడం జరుగుతుందని వైద్యులు తెలిపారు.
జియోన్ చిన్నపటి నుండి కూడా తనకి కాళ్లు లేవని ఎప్పుడు బాధ పడలేదు.అలాగని ఒకరి మీద ఆధారపడి కూడా బతకలేదు.
తనకి కాళ్ళు లేకపోతేనే దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కదా అనుకుని చేతులతోనే అన్ని పనులు చేసుకుంటూ వచ్చాడు.
రోజు జిమ్ కు వెళ్లి వర్క్ ఔట్స్ చేసేవాడు.
జియోన్ కు చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యం ఉండేది.రెజ్లర్, అథ్లెట్ లేదంటే ఒలింపిక్స్ లో గాని మెడల్ సంపాదించాలని అనుకునేవాడు.

ఈ క్రమంలోనే గ్రౌండ్ లో దిగి ప్రాక్టీస్ కూడా చేసేవాడు.అలా రెండు కాళ్లు లేకున్నాగాని అతను అనుకున్న విధంగా అథ్లెట్, రెజ్లర్ అయ్యాడు.అలాగే అత్యంత వేగంగా పరుగెత్తగలనని నిరూపించి చూపించాడు.కేవలం 20 మీటర్లను 4.78 సెకండ్లలో చేతులతో అత్యంత వేగంగా పరిగెత్తి గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు.తాను అనుకున్న లక్ష్యాన్ని చేరినందుకు గాను జియోన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
జియోన్ ఆత్మస్తైర్యం, పట్టుదలను చూసిన నెటిజన్లు అతన్ని అభినందిస్తున్నారు.