Zeenat Aman: డేటింగ్ అంటూ అబ్బాయిలతో బెడ్ రూమ్ దాకా వెళ్లొద్దు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

నటి జీనత్‌ అమన్‌.( Zeenat Aman ) ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పాట.

 Zeenat Aman Young People Dont Jump Bed Right Away-TeluguStop.com

దమ్ మారో దమ్.( Dum Maro Dum ) ఈ పాట అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.కొద్ది రోజులు పాటు ఎక్కడ చూసినా కూడా ఈ పాట మారు మోగిపోయింది.ఇప్పటికీ ఈ పాట ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు.ఈ పాటతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది జీనత్‌ అమన్‌.అయితే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఆమె పెళ్లి చేసుకుని నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది.1985లో నటుడు, దర్శకుడు మజర్‌ ఖాన్‌ను పెళ్లాడింది జీనత్‌.

Telugu Actresszeenat, Bed, Dummaro, Love, Mazhar Khan, Sensational, Young, Zeena

పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులు పుట్టాక ఇంటికే పరిమితమైంది.అయితే మజర్‌,( Mazhar Khan ) జీనత్‌ మధ్య పొరపచ్చాలు రావడంతో అతడి వేధింపులు తాళలేక విడాకులు తీసుకొని విడిపోయింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె ప్రేమ డేటింగ్( Dating ) అనే అంశాలపై స్పందించింది.

ఈ సందర్బంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఈ విషయం చెప్పాల్సి వస్తున్నందుకు నిజంగా సారీ, ఈ జనరేషన్‌ వారు వారి ఫీలింగ్స్‌ను కంట్రోల్‌ చేసుకుంటే బాగుంటుంది.ఒకరు మనసుకు నచ్చగానే అతడితో బెడ్‌ ఎక్కేయడం అస్సలు కరెక్ట్‌ కాదు.

Telugu Actresszeenat, Bed, Dummaro, Love, Mazhar Khan, Sensational, Young, Zeena

మీరు ఆ పని చేయకండి.ఒకరి గురించి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకోండి.మీకు మీరే చాలా విలువైన వారు.అలాంటిది మిమ్మల్ని మీరు ఒకరికి అర్పించుకోకండి.మీ వ్యక్తిత్వాన్ని అవతల పారేయకండి.ప్రతి మహిళ ఆర్థికంగానూ నిలదొక్కుకోవాలి.

అప్పుడే వారి భవిష్యత్తును వారే నిర్మించుకోగలరు.ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉంటారో వారు తమ కలను నిజం చేసుకునేందుకు, లక్ష్యాలను చేధించేందుకు ఒక అడుగు ముందే ఉంటారు.

ఆర్థిక స్వేచ్ఛ అంటే డబ్బులు సంపాదించడం, చేతిలో డబ్బులుండటం మాత్రమే కాదు.ఎవరి ప్రమేయం లేకుండా మీకు నచ్చినట్లుగా మీరు బతికేయడం.

అలా ఉన్నప్పుడే మీకు మీరుగా రాణించగలరు అని చెప్పుకొచ్చింది జీనత్‌ అమన్‌.కాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube