ఏపీ ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి విడదల రజినీ తెలిపారు.ఈ క్రమంలోనే జగనన్న సురక్ష అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న ఆమె ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు.
ప్రతి వ్యక్తికి వైద్యం అందించడమే జగనన్న సురక్ష లక్ష్యమని మంత్రి విడదల రజినీ తెలిపారు.ఇందులో భాగంగా మొదటి దశలో డోర్ టూ డోర్ వెళ్లి వాలంటీర్స్ అవగాహన కల్పిస్తారని చెప్పారు.
ఆరోగ్య శ్రీ, 104 వాహనం సేవలు, ఫ్యామిలీ డాక్టర్ ను ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు వాలంటీర్లు తెలియజేస్తారని తెలిపారు.ఏడు పరీక్షలు చేసి కే -షీట్ ను జగనన్న సురక్ష యాప్ లో అప్ లోడ్ చేస్తారని పేర్కొన్నారు.
ఈ పథకం కింద మొత్తం 105 రకాల మందులు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని మంత్రి విడదల రజిని వెల్లడించారు.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే జగనన్న సురక్ష లక్ష్యమన్న ఆమె నిఫా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు.