వైసీపీ పార్టీలోని ఈ మధ్య కొంతమంది ఎంఎల్‌ఏ లు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమకు కనీసం దక్కాలిసిన ప్రోటోకాల్ మర్యాదలు కూడా దక్కడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గడిచిన వారంలో నగరి వైసీపీ ఎంఎల్‌ఏ రోజా రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల పనుల్లో తమను సంప్రదించడలేదని, ప్రభుత్వం నుండి అందవలిసిన కనీస ప్రోటోకాల్ మర్యాదలు కూడా అందడంలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
ఇప్పుడు ఇదే బాటాలోకి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎంఎల్‌ఏ ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రోటోకాల్ విషయంలో ఆవేదన వ్యక్తం చేశాడు.

నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంఎల్‌ఏ ను ఆహ్వానించకపోవడంపై జిల్లా అధికారుల తీరుపై మండి పడ్డాడు.ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక ఏవైనా అంతర్గత రాజకీయ శక్తులు ఏమైనా అడ్డుకుంటున్నాయ అంటూ అగ్రహం వ్యక్తం చేశాడు.ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగ పిలవలేదని చెప్పారు.ఈ విషయంపై రామ్ నారాయణరెడ్డి ఈసి కి ఫిర్యాధు చేశాడు.
ఈసి అందుకు జవాబు ఇస్తూ అలాంటి నిబందన ఏమీలేదని జవాబు ఇచ్చింది.ప్రోటోకాల్ నిబందనలు ప్రకారం ప్రభుత్వ పన్నుల్లో స్థానిక రాజకీయనాయకుడిని ప్రభుత్వ అధికారులు గౌరవప్రదంగా పిలవడం జరుగుతుంది.
కానీ ప్రోటోకాల్ మర్యాదలు దక్కకపోవడంతో న్యాయపరమైన పోరాటం చేస్తానని ఆనం అన్నాడు.ఈ విషయాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్న అని తెలిపాడు
.