ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై వైయస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు...!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) సంతనూతలపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో సీఎం జగన్( CM Jagan ) పై విమర్శలు చేశారు.

 Ys Sharmila Serious Comments On Cm Jagan During Election Campaign , Ys Sharmila,-TeluguStop.com

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.అలాంటి వారు అధికారంలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు.

సొంత బాబాయిని హత్య చేసిన జగన్ తన పక్కనే పెట్టుకుంటున్నారని పిలిచి టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు.ఎక్కడ చూసినా మాఫియా మయమే అయిందని విమర్శించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావాలని అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.

వైకాపా హాయంలో నిత్యవసరాల వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.చక్కెర నుంచి పెట్రోల్ వరకు సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుంది.జగన్ బటన్ నొక్కి ఇచ్చేది పది రూపాయలు అయితే తిరిగి ₹100 వసూలు చేస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం.పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం.5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తాం.వృద్ధుల పింఛన్ ₹4000, వికలాంగుల పెన్షన్ ₹6000 పెంచుతాం.

యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా… రాష్ట్ర రాజధాని నిర్మించాలన్నా .కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది.ఆంధ్రప్రదేశ్ మళ్లీ బాగుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube