చాలామంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుకోకుండా కన్ను మూసిన వారు ఉన్నారు.కేవలం హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ప్రమాదాల ద్వారా మరణించిన వారు ఉన్నారు.
అతి చిన్న వయసులోనే ఎంతో స్టార్ డం సంపాదించుకొని ప్రేక్షకుల అభిమానం సంపాదించుకొని అనుకోని ప్రమాదాల కారణంగా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయారు.వారి మరణం టాలీవుడ్ సినిమా పరిశ్రమకే తీరని లోటుగా చెప్పొచ్చు.
అలా అతి చిన్న వయసులో కన్నుమూసిన హీరోయిన్ లలో దివ్య భారతి, సౌందర్య, శ్రీదేవి( Divya Bharti, Soundarya, Sridevi ) వంటి వారు ఉన్నారు.వీరు పోతూ పోతూ వారి పేరు మీద ఎన్నో కోట్ల రూపాయల ఆస్తిని తమ కుటుంబానికి ఇచ్చి వెళ్లారు.
ఉదాహరణకు శ్రీదేవిని తీసుకుంటే ఆమె దుబాయ్ లో బంధువుల పెళ్ళికి వెళ్లి తన హోటల్ గదిలోనే ప్రమాదవశాత్తు బాత్ డబ్బులో పడి కన్ను మూసింది.ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులను సంపాదించుకున్న శ్రీదేవి అలా కన్నుమూస్తుంది అని ఎవరు ఊహించలేదు.
అయితే ఆమె పేరు మీద దాదాపు 250 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉన్నాయట ఆ తర్వాత తన భర్తకు మరియు కుటుంబానికి అవి బదిలీ చేయబడ్డాయి.
ఇక సౌందర్య సంగతి తీసుకుంటే ఆమె 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసింది.కరీంనగర్ కి బిజెపి తరఫున ప్రచారం చేయడానికి వెళుతున్న సమయంలో ఆమె హెలికాప్టర్లో ఉన్నారు.అనుకోకుండా అది ప్రమాదవశాత్తు కూలి చనిపోయారు.
ఆ సమయంలో సౌందర్య పేరు మీద దాదాపు 70 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట.అప్పట్లో 70 కోట్లు అంటే చిన్న మాట కాదు.
వాటి గురించి కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.అందులో ఎక్కువ భాగం తన భర్త కి చెందే విధంగా ఉన్నాయట.
కానీ అదే ప్రమాదంలో తన అన్నయ్య అమర్నాథ్ కూడా చనిపోయారు.తన భర్త చెప్పు చనిపోయాడు పిల్లలు అనాధలు అయ్యారు కాబట్టి తనకు కొంత ఆస్తి రావాలని ఆమె వదిన కోర్ట్ కి ఎక్కింది.
ఇప్పటికి అది ఇంకా నడుస్తూనే ఉంది.
ఇక చిన్న వయసులో, దాదాపు టీనేజ్ వయసు దాటగానే చనిపోయిన హీరోయిన్ దివ్య భారతి.బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.సరదాగా కిటికి పక్కన కూర్చుని మద్యం సేవిస్తున్న టైం లో కిందపడి కన్ను మూసింది.
ఆమె చనిపోయి నాటికి ఆమె పేరుపైన ఇంచుమించు 50 కోట్ల ఆస్తులు ఉన్నాయట.అవి ఆమె తల్లిదండ్రుల పేరుపై ఉండడంతో సమస్యలు ఏమి రాలేదు.దివ్యభారతి 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది.