ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ అంటే చాలు అది వారసత్వంగా వస్తుంది అని అందరూ అనుకునేలా ఉన్నాయి పరిస్థితులు.ఎవరైనా కొత్తగా స్టార్ పరిచయం అవుతున్నాడు అంటే ఆయన తాత ఎవరు ? తండ్రి ఎవరు ? ఎంత ఆస్తి ఉంది అని ఆరా తీయడం మొదలుపెట్టారు.సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలే కనిపిస్తున్నాయి.మరి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోలు ఎదగడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు.ఉదాహరణకు విజయ్ దేవరకొండనే ( Vijay Deverakonda )తీసుకోండి ఎంతో కష్టపడి పైకి వచ్చినా ఆయనకు హిట్టు లేక ఆరేళ్లు గడుస్తోంది.తీసిన ప్రతి సినిమా పరాజయం పాలవుతుంది.
దాంతో విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నాడు.ఇదే స్థానంలో ఒక స్టార్ కిడ్ ఉంటె ఇలా జరుగుతుందా .
బ్యాగ్రౌండ్ లేకుండా హీరోల మనుగడ కూడా చాలా కష్టంగా మారింది.అయితే ఎప్పుడైనా ఆలోచించారా? స్టార్ హీరోలకు బ్యాగ్రౌండ్ కావాలి కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్( Heroines ) వందల్లో, వేళల్లో ఉన్నారు అని.వారికి బ్యాగ్రౌండ్ తో పని లేదు.నటించామా డబ్బులు తీసుకున్నామా, కెరియర్ ను ముందుకు తీసుకెళ్తున్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు.
హీరోకి సినిమా అంటే దానికి సేల్ వ్యాల్యూ ఉండాలి.కానీ హీరోయిన్ కి అలాంటి బాధ లేదు.
రెమ్యునరేషన్ ( Remuneration )కూడా ఎంతిస్తే అంత తీసుకుంటారు.హీరోయిన్ అనగానే అందాల ప్రదర్శనె మూలంగా ఇప్పట్లో సినిమాలు తెరకెక్కుతున్నాయి.
కాబట్టి ఏ బాధ లేదు.అయితే ఇక్కడ ఒక తేడా గమనించాలి హీరోయిన్స్ లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది.
మూడేళ్లు మహా అయితే అది ఐదేళ్లు అంతకన్నా ఎక్కువగా వారి మనుగడ కనిపించడం లేదు.
అదే ఒక హీరో ఇండస్ట్రీకి వస్తే ముసలివాడు అయినా కూడా హీరోగాని నటిస్తాడు.మనవళ్లు, మనవరాలు వచ్చిన స్టార్ హీరోలు టాలీవుడ్ లో ప్రస్తుతం చాలామంది ఉన్నారు.వీరికి బ్యాగ్రౌండ్ ఉన్నా లేకపోయినా సెటిల్ అయిపోయారు కాబట్టి వారి పిల్లలు వారిని ఆధారంగా చేసుకుని హీరోలుగా ఎదుగుతున్నారు.
సో ఇకనైనా హీరోలు హీరోయిన్స్ ని ఆదర్శంగా తీసుకొని బ్యాగ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీకి రావాలి.భారీ పర్ఫామెన్స్ చూపించి అవకాశాలు దక్కించుకోవాలి.పారితోషకం విషయంలో, అలాగే మార్కెట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా కూడా స్టార్ హీరోలు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి.