మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.వివేకా వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదన్న ఆమె ఆస్తుల కోసం వివేకానంద రెడ్డి హత్య జరగలేదని తెలిపారు.
వివేకా ఆస్తులు అన్నీ సునీతారెడ్డి పేరు మీదనే ఉన్నాయని పేర్కొన్నారు.వైఎస్ వివేకా ఒక ప్రజా నాయకుడన్న షర్మిల ఆయన ఎలాంటివారో తమకంటే కూడా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలకే తెలుసని వెల్లడించారు.
ప్రజల కోసం పని చేసిన వ్యక్తి వివేకా అని షర్మిల తెలిపారు.