కష్టమైనా నష్టమైనా జగన్ అదే చేయబోతున్నాడా ...?

వైసీపీ అధినేత జగన్ రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి…? ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఏ విధమైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు…? ఆ వ్యూహాల్లో భాగాంగా… ఎవరెవరి మద్దతు తీసుకోబోతున్నాడు.? ఎవరెవరిని తొక్కబోతున్నాడు…? ఇంకా ఏ విధమైన స్టెప్స్ తీసుకోబోతున్నాడు అనే సవాలక్ష సందేహాలు అందరిలోనూ… కలుగుతోంది.అయితే ఈ సారి ఎన్నికల్లో జగన్ ఖచ్చితంగా … గెలిచి తీరాల్సిందే.ఎందుకంటే…గత ఎనిమిది సంవత్సరాలకు పైనే జగన్ ప్రతిపక్షంలో కూర్చున్నాడు.ఈ సందర్భంగా ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కుంటూ… పార్టీని లాక్కొస్తున్నాడు.గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్యెల్యేల్లో కూడా దాదాపు సగం మంది ఎమ్యెల్యేలు అధికార పార్టీ టీడీపీ లో చేరిపోయారు.

 Ys Jagan Wants Kcr Support In 2019 Ap Elections For His Victory-TeluguStop.com

ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్ గట్టిగానే కష్టపడుతున్నాడు.ఎందుకంటే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే… ఆ తరువాత ఏం జరుగుతుందో జగన్ కి బాగా తెలుసు.

అందుకే జగన్ ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీని ఢీ కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.ఆ ప్రయత్నాల్లో భాగాంగానే… టీఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకునేందుకు కూడా జగన్ ఒకే చెప్పాడు.దీనిపై ఎన్ని విమర్శలు చెలరేగినా జగన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.టీఆర్ఎస్ అధినేత మాత్రం జాతీయ రాజకీయాల మీద ప్రధాన దృష్టంతా పెట్టాడు.తెలంగాణాలో మరో ఐదేళ్ల పాటు ఎలాగూ… వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకపోవడంతో ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసి బలపరిచే ఆలోచనతో ముందుకు దూసుకు వెళ్తున్నాడు.ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ్‌ బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చలు కూడా జరిపారు.

ఇక ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ ఏపీ.కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌ గెలవటం ఎంత ముఖ్యమో, ఏపీలో చంద్రబాబుని గద్దె దింపటం కూడా అంతే మఖ్యమైందిగా భావిస్తున్న కేసీఆర్.ఫ్రంట్‌ లో భాగస్వామ్యం, ఏపీ రాజకీయాలపై ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ తో మంతనాలు జరపాలని నిశ్చయించుకున్నారు.ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌, వినోద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌ కుమార్‌రెడ్డి తదితరులు జగన్‌తో చర్చలు జరపనున్నారు.

ఈ భేటీలో ఏం జరగబోతోంది … ఏ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తి కలిగిస్తోంది.కేసీఆర్ సూచనలు…సలహాలతో జగన్ గట్టెక్కేందుకు చూస్తున్నాడా… కష్టమైనా … నష్టమైనా కేసీఆర్ బాటలోనే ఆయన సహాయ సహకారాలు తీసుకునేందుకు చూస్తున్నాడా అనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube