సమన్యాయం కోసమే వికేంద్రీకరణ అంటున్న జగన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం పై అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.

ప్రస్తుతానికి రాజధాని అంశం పై ధర్మాసనాలలో విచారణ జరుగుతుంది.

తుది తీర్పు తమకు అనుకూలంగా రావాలని అటు ప్రతిపక్షం ఇటు అధికారపక్షం తాము చేయగలిగినవన్నీ చేస్తున్నాయి.తాజాగా రాజధాని అంశంపై హై కోర్ట్ స్టేటస్ కోను ఈ నెల 27వరకు ఎక్స్టెండె చేసింది.

దానితో ఈ అంశంపై దీని పై నిన్న చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రెస్ మీట్ ను అరేంజ్ చేసి ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు.రాజధాని అంశంలో ప్రతిపక్షం వాయిస్ ఎక్కువగా ప్రజలలోకి వెళ్తుంది.

అందుకే సీఎం జగన్ తానే ఈరోజు స్వయంగా ఈ అంశంపై స్పందించారు.గతంలో మనం హైదరాబాద్ లో చేసిన తప్పు మళ్లీ జరగకూడదని అన్ని ప్రాంతాలకు సమన్యాయం అందాలనే ఉద్దేశంతో ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Advertisement

అంతేకాకుండా తమ ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.ఇక రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయడం కోసం నిత్యావసర వస్తువులను సెప్టెంబర్ నుండి డోర్ డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు