మ‌ద్యం తాగిన కోతి ఏం చేసిందో చూస్తే న‌వ్వు ఆపుకోలేరు..

నిత్యం సోష‌ల్ మీడియాలో  వైర‌ల్ అయ్యే వీడియోల‌ను చూస్తుంటే చిత్ర విచిత్రంగా అనిపించ‌క మాన‌దేమో.ఎందుకంటే అలాంటి వీడియోలు నిజంగా జ‌రుగుతాయా అంటే చాలా క‌ష్టం అనే చెప్పాలి.

 You Can Not Stop Laughing When You See What The Drunken Monkey Did .., Monkey Dr-TeluguStop.com

కానీ సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి వీడియోల‌కు స్కోప్ పెరిగింది.సోష‌ల్ మీడియా రాక‌ముందు కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగేవి.

కానీ అవి ఎవ‌రికీ తెలిసేవి కావు.ఇప్పుడు అలా కాదు.

ఎక్క‌డ ఏం జ‌రిగినా స‌రే వెంట‌నే నెట్టింట్లో ప్ర‌త్యక్ష్యం అయిపోతుంది.అందుకే సోష‌ల్ మీడియా ఇంత‌లా ప్రాచుర్యం పొందింది.

మ‌న‌కు నెట్టింట్లో ఎక్కువ‌గా క‌నిపించే వాటిల్లో కోతుల‌కు సంబంధించిన వీడియోలు ఉంటున్నాయి.ఎందుకంటే కోతులు కూడా మ‌నుషుల‌కు చాలా ద‌గ్గ‌రి పోలిక‌ల‌తో ఉంటాయి క‌దా.

అందుకేనేమో అవి అంత‌లా మ‌న‌తో క‌నెక్ట్ అయిపోతున్నాయి.అచ్చం మ‌నుషులు వాడిన‌ట్టే అవి కూడా మ‌న వ‌స్తువుల‌ను వాడేస్తున్నాయి.

మొన్న‌టికి మొన్న ఓ కోతి ఫోన్ తో వీడియోలు చూడ‌టం కూడా చూశాం.అంత‌కు ముందు చీర క‌ట్టుకున్న కోతికి సంబంధించిన వీడియోల‌ను చూశాం.

ఇప్పుడు మాత్రం ఓ కోతి ఏకంగా మద్యం సేవిస్తోంది.

వినేందుకు కొంచెం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నా ఇదే నిజ‌మండి బాబు.ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో ఓ కోతి పెద్ద సీసాను త‌న ద‌గ్గ‌ర‌కు తెచ్చుకోవ‌డం ఇందులో చూడొచ్చు.అయితే ఆ సీసాలో మ‌ద్యం ఉందండోయ్‌.

దాన్ని రెండు చేతుల‌తో పైకి ఎత్తుకుని హాయిగా లాగించేస్తోంది.కొంచెం తాగిన త‌ర్వాత మ‌ళ్లీ న‌డుస్తోంది.

అయితే ఇలా న‌డిచేట‌ప్పుడు అది తిన్న‌గా న‌డ‌వ‌కుండా అటూ ఇటూ తూలుతూ న‌డుస్తోంది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

దీన్ని చూసిన వారంతా కూడా ఇదేం కోతి బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube