ఏపీలో వైసీపీ పాలన క్లైమాక్స్ కు చేరిందని టీడీపీ నేత యనమల అన్నారు.సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని తెలిపారు.
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని యనమల ఆరోపించారు.
మంత్రి ఆదిమూలపు అర్ధనగ్న ప్రదర్శన చూస్తే ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతోందన్నారు.జగన్ మెప్పు కోసం మరీ ఇంతలా దిగజారాలా అని ప్రశ్నించారు.