మెగా హీరో సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) విరూపాక్ష సినిమా ( Virupaksha Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈయన ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది.
ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.
రోడ్డు ప్రమాదం తర్వాత పూర్తిగా ఇంటికి పరిమితమైన ఈయన కోలుకొని తిరిగి విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఈయన ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు.
ఇలా ప్రమాదం తర్వాత సినిమా కోసం ఎంతో కష్టపడిన సాయి ధరమ్ తేజ్ సినిమా పూర్తి అయిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వచ్చారు.ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో కుటుంబ సభ్యుల నుంచి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున సాయి ధరమ్ తేజ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక బొకే పంపించి తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఒక బొకే పంపించడమే కాకుండా విషెస్ తో కూడిన ఒక కార్డు కూడా బహుమానంగా పంపించారు.ఇందులో డియర్ తేజు గారికి మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ గ్రాండ్ సక్సెస్ అఫ్ విరూపాక్ష.బెస్ట్ విషెస్ పవన్ కళ్యాణ్ అంటూ ఒక కార్డును కూడా మేనల్లుడికి కానుకగా పంపించారు.ఇక ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని కూడా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) లాంచ్ చేయగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఈయన విషెస్ తెలియజేయడంతో ఈ సినిమాకి మరింత హైప్ పెరిగింది.
పవన్ కళ్యాణ్ ఈ విధంగా సినిమా గురించి విష్ చేయడంతో స్పందించిన సాయి ధరమ్ తేజ్ థాంక్యూ సో మచ్ చిన్న మామయ్య ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ రిప్లై ఇచ్చారు.