గత సంవత్సర కాలంగా తో కలిసి నడుస్తామని సూచనప్రాయంగా పవన్ చెబుతున్నపటికీ నిన్న రాజమండ్రి వేదికగా ఈ విషయం పై స్పష్టమైన ప్రకటన చేశారు.దాంతో రెండు పార్టీల అభిమానులలోనూ మిశ్రమ స్పందనలు కలిగాయి.
తెలుగుదేశం క్యాడర్ పూర్తిస్థాయిలో ఆనందిస్తుంటే, జనసేన( Janasena )లో మాత్రం కొందరు పవన్ ముఖ్యమంత్రి కాలేడు కదా అన్న అభిప్రాయంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే అధినేత నిర్ణయమే ఫైనల్ అన్న అభిప్రాయానికి మెజారిటీ అభిమానులు, కార్య కర్తలు వచ్చినట్లుగా వారి సోషల్ మీడియా స్పందన చూస్తుంటే అర్థమవుతుంది.

అయితే పవన్ పొత్తు( Pawan Kalyan Alliance Decision ) నిర్ణయం జనసేన అభిమానుల్ని ఎంత బాధ పెట్టిందో తెలియదు గానీ అధికార వైసిపి నేతలను, శ్రేణులు మాత్రం తీవ్ర నిరుత్సాహపరచినట్టుగా పవన్ పై వారు చేస్తున్న మూకుమ్మడి దాడి బట్టి తెలుస్తుంది.పవన్ నిర్ణయం ఏదో నేరం అన్నట్టు ,పవన్ రాష్ట్రానికి ఏదో ఘోరమైన విపత్తును తీసుకొస్తున్నట్టు వైసిపి సోషల్ మీడియా వింగ్ విపరీతంగా విమర్శలు చేస్తుంది.అంతేకాకుండా వైయస్సార్ పార్టీ నాయకులు( YSRCP Leaders ) కూడా పవన్ పై సభ్యత మరిచి విమర్శలు చేస్తున్నారు.ఒక రాజకీయ పార్టీగా ఎవరితో కలిసి నడవాలి ,ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి అన్నది కనీస హక్కు.
పవన్ ఆ హక్కును ఉపయోగించుకుంటున్నారు .మరి రాజకీయ విమర్శలను కూడా పక్కన పెట్టి పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో పవన్ పై అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా గర్హనీయమనే చెప్పవచ్చు .

మంత్రి రోజా( Minister Roja ) అయితే పరుష పదజాలం తో పవన్ పై చెలరేగిపోయారు .అయితే ఈ విమర్శలు టిడిపి -జనసెన కూటమికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి అన్న ప్రాథమిక తర్కాన్ని వైసీపీ శ్రేణులు మర్చిపోతున్నట్లుగా ఉన్నాయి .తెలుగుదేశం జనసేన కూటమి( Janasena TDP Alliance ) ది విన్నింగ్ కాంబినేషన్ అని ఎప్పటినుంచో ఉన్న అంచనాలు ఉండడం, ఇప్పుడు పొత్తు ఫైనల్ కావడం తో వైసిపి శ్రేణులు ఒత్తిడికి గురై ఆ ప్రస్టేషన్ను ఇలా విమర్శల రూపంలో చూపిస్తున్నారు అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.ఏది ఏమైనప్పటికీ హద్దు మీరిన విమర్శలు ఏ పార్టీకి మంచివి కావనే వైసీపీ అధిష్టానం గుర్తించాలని ఇప్పటికైనా ఈ విషయంలో కలగ చేసుకుని తమ శ్రేణులను నియంత్రించుకోవాలని రాజకీయ విశ్లేషకులు వాఖ్యనిస్తున్నారు.