కన్నడ పరిశ్రమలో ఫస్ట్ ఎవర్ రికార్డ్ సృష్టించిన యష్..!

కేజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమాతో చాలా మంది జీవితాలు మారిపోయాయి.

 Yash Enters Fastest 5 Million Family On Instagram, Instagram, 5 Millions, Yash,-TeluguStop.com

ఈ సినిమాతో హీరో యష్ స్టార్ హీరోగా ఎదిగాడు.అంతేకాదు యష్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే.

ఈ సినిమాతో యష్ తన మార్కెట్ ను అమాంతం పెంచుకున్నాడు.

కేజీఎఫ్ సినిమాలో యష్ రాఖీ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.కేజీఎఫ్ చాప్టర్ 2 లో బాలీవుడ్ స్టార్లు సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్నారు.

నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Telugu Sandalwood, Yash-Movie

కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో రాఖీ బాయ్ లవర్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు.త్వరలో ప్రేక్షకులను అలరించడానికి యష్ సిద్ధం అయ్యాడు.ఈ సినిమా రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా యష్ కన్నడ పరిశ్రమలో ఏ హీరో సాధించలేని రికార్డు ను సాధించాడు.అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా సోషల్ మీడియాలో రికార్డు సృష్టించాడు.

ఇన్స్టాగ్రామ్ లో యష్ 5 మిలియన్ల క్లబ్ లో చేరి పోయాడు.ఇప్పటి వరకు కన్నడలో ఏ హీరో కూడా ఈ రికార్డు సాధించలేదు.

ఇన్స్టాగ్రామ్ లో ఫాస్టెస్ట్ 5 మిలియన్లను చేరుకున్న ఏకైక హీరోగా నిలిచి అతడికి ఎంత ఫాలోయింగ్ ఉందో నిరూపించుకున్నాడు.ఈ సినిమా జులై 16 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube