హిందీ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ 100 ఏళ్ల ప్రయాణంలో హిందీ చిత్రసీమలో వైవిధ్యంతో కూడిన వివిధ దశలు ఉన్నాయి.ఇప్పుడు హిందీ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
1.వహీదా రెహ్మాన్ అమితాబ్ బచ్చన్‌కు తల్లిగానూ, స్నేహితురాలిగానూ తెరపై కనిపించింది.ఆమె 1976లో అదాలత్ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌కి స్నేహితురాలుగా చేసింది.వహీదా 1978లో త్రిశూల్‌లో అమితాబ్‌కు తల్లిగా కనిపించింది.2.అమీర్ ఖాన్ నటించిన చిత్రం లగాన్.హిందీ సినిమా చరిత్రలో మైలు రాయిగా నిలిచింది.చాలా మంది బ్రిటిష్ నటులు కనిపించిన మొదటి, ఏకైక భారతీయ సినిమాగా నిలిచింది.3 .సునీల్ దత్ సినిమాల్లోకి రాకముందు ముంబైలోని ఒక రేడియోలో పని చేసేవారు.అక్కడ ఒకసారి నర్గీస్‌ని ఇంటర్వ్యూ చేసే అవకాశం అతనికి లభించింది.
అయితే నర్గీస్‌ని చూసిన తర్వాత సునీల్ దత్ ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేకపోయాడు.దీంతో ఇంటర్వ్యూని రద్దు చేయాల్సి వచ్చింది.
తరువాత 1957 సంవత్సరంలో ఇద్దరూ కలిసి నటించారు.ఈ సమయంలో వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.తరువాత వివాహం చేసుకున్నారు .4.రణవీర్ కపూర్ చిత్రం రాక్‌స్టార్.రెండవ భాగంలో అతని హెయిర్ స్టయిల్ మొదటి భాగంలోని క్యారెక్టర్ పై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో ముందుగా రెండవ భాగాన్ని చిత్రీకరించారు.5.అనిల్ కపూర్ ముంబైకి వచ్చినప్పుడు అతను కుటుంబంతోపాటు గ్యారేజీలో ఉన్నాడు.కొంతకాలం తర్వాత ముంబైలోని ఒక సాధారణ, మధ్యతరగతి ఇంట్లో ఉన్నాడు.6.రాజ్ కపూర్ చిత్రం మేరా నామ్ జోకర్ హిందీ చిత్రసీమలో ఇంటర్వెల్ లేని మొదటి చిత్రం.7.హృతిక్ రోషన్ చిత్రం కహో నా ప్యార్ హై 2002 సంవత్సరంలో అత్యధిక అవార్డులను గెలుచుకున్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది.ఈ చిత్రం మొత్తం 92 అవార్డులను సొంతం చేసుకుంది.