ఇది ప్రపంచంలోనే అద్భుతమైన కోట.. నిర్మాణానికి 400 ఏళ్లు... ఎక్కడుందంటే..

మన దేశంలో పురాతన కాలం నాటి కోటలు, భవనాలు ఎన్నో ఉన్నాయి.ఈ భవనాలు పలు రహస్యాలకు నిలయంగా ఉన్నాయి.

 This Is The Worlds Most Amazing Fort Golconda Fort Details, Golconda Fort, World-TeluguStop.com

ఇప్పుడు మనం తెలుసుకోబోయే కోట కూడా రహస్యాల మయంగా ఉంది.అదే గోల్కొండ కోట. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉంది.ఇది హైదరాబాద్ లో ప్రధాన పర్యాటక ప్రదేశంగా కూడా పేరొందింది.

ఇది దేశంలోని అతిపెద్ద మానవ నిర్మిత సరస్సులలో ఒకటైన హుస్సేన్ సాగర్ సరస్సు నుండి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ కోట ఉత్తమ సంరక్షిత స్మారక కట్టడాలలో ఒకటిగా ఖ్యాతి దక్కించుకుంది.

ఈ కోట నిర్మాణం 1600లలో పూర్తయిందని, అయితే 13వ శతాబ్దంలో కాకతీయ వంశస్థులు దీని నిర్మాణం ప్రారంభించారని చరిత్ర చెబుతోంది.ఈ కోట ఇప్పటికీ… దాని వాస్తుశిల్పం, చరిత్ర, రహస్యాల పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఈ కోట నిర్మాణం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.ఒకరోజు ఒక గొర్రెల కాపరికి కొండపై ఒక విగ్రహం దొరికిందని చెబుతారు.

ఆ సమాచారం అప్పటి పాలకుడు కాకతీయ రాజుకు చేరడంతో అతను దానిని పవిత్ర స్థలంగా భావించి, చుట్టూ మట్టి కోటను నిర్మించాడు.దీనినే నేడు గోల్కొండ కోట అని పిలుస్తున్నారు.

ఈ కోట 400 అడుగుల ఎత్తైన కొండపై నిర్మితమయ్యింది.ఈ కోటకు ఎనిమిది ద్వారాలు, 87 బురుజులు ఉన్నాయి.

ఈ కోట ప్రధాన ద్వారం పేరు ఫతే దర్వాజా.ఇది 13 అడుగుల వెడల్పు , 25 అడుగుల పొడవు కలిగివుంది.

ఈ తలుపు ఏనుగుల దాడి నుండి సురక్షితంగా ఉంచడానికి ఉపయోగించే స్టీల్ స్పైక్‌లతో రూపొందింది.

Telugu Golconda Fort, Golcondafort, Hyderabad, Kakatiya, Telangana, Thalia Manda

కోటపైకి చేరుకోవాలంటే వెయ్యి మెట్లు ఎక్కాలి.కోటలో ఎవరైనా చప్పట్లు కొట్టినప్పుడు, అది కోట అంతటా ప్రతిధ్వనిస్తుంటుంది.ఈ ప్రదేశాన్ని ‘తాలియా మండప్’ లేదా సౌండ్ అలారం అని కూడా అంటారు.

కోటలో ఒక రహస్యమైన సొరంగం కూడా ఉందని చెబుతారు.ఇది కోట దిగువ భాగంలో ఉందని చెబుతారు.

అత్యవసర పరిస్థితుల్లో రాజకుటుంబానికి చెందిన వారిని సురక్షితంగా తరలించేందుకు ఈ సొరంగం ఉపయోగపడేదని చరిత్ర విశ్లేషకులు చెబుతున్నారు.అయితే ప్రస్తుతం ఈ సొరంగం మూతబడివుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube