భారతీయ ఆర్ధికవేత్తకు ప్రపంచబ్యాంకులో కీలక పదవి

భారతీయ ఆర్దికవేత్త అబ్బాస్ ఝాను దక్షిణాసియా వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంకు కీలక పదవిలో నియమించింది.అంపన్ తుఫాను ఒడిషా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌‌లను తీవ్రంగా దెబ్బతీసిన సమయంలో అబ్బాస్ నియామకం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 Indian Economist Appointed To Key World Bank Position In South Asia,south Asia,i-TeluguStop.com

దక్షిణాసియా ప్రాంతంలో విపత్తుల నిర్వహణ, వాతావరణ మార్పులపై పనిచేస్తున్న బృందానికి అబ్బాస్‌ను వరల్డ్ బ్యాంక్ ప్రాక్టీస్ మేనజర్‌గా నియమించింది.ఝా నాయకత్వంలో తమ బృందం అద్భుతంగా పనిచేస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ హోదాలో సింగపూర్‌కు వెలుపల ఇతర ప్రాక్టీస్ మేనేజర్లు, గ్లోబల్ లీడ్స్, గ్లోబల్ సొల్యూషన్స్‌తో అబ్బాస్ కలిసి పనిచేస్తారని బ్యాంకు తెలిపింది.వాతావరణ మార్పులు, విపత్తులకు సంబంధించి ఉత్తమమైన పరిష్కారాలను అందించడానికి నిపుణుల బృందాన్ని దక్షిణాసియా దేశాలకు పంపడం అబ్బాస్ కర్తవ్యం.

కాగా భారత పౌరుడైన ఝా 2001లో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, శ్రీలంకలలోని ప్రపంచబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయాల్లో పనిచేశారు.అలాగే లాటిన్ అమెరికా, కరేబియన్, యూరప్, సెంట్రల్ ఆసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు.

ప్రస్తుతం తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో పట్టణ అభివృద్ధి, విపత్తు నిర్వహణా ప్రాక్టీస్ మేనేజర్‌గా అబ్బాస్ విధులు నిర్వర్తిస్తున్నారు.తాజా నియామకం ప్రకారం.

ఆయన నియంత్రణలో భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube