టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు నూతల పార్టీ నంబూద్రీ ప్రసాద్, తిరువీధుల నరసింహమూర్తి, న్యాయవాది కొమ్మారెడ్డి వీర రాఘవరెడ్డి.
తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది.ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేశానికి అభివృద్ధి, సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని ప్రశంసించారు.
మహిళలకు ఆస్తి హక్కు.బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్ లు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన నాయకుడని కొనియాడారు.ఎన్టీఆర్ తెలుగుజాతి కీర్తి కిరీటం అని అన్నారు.
ఎన్టీఆర్.టీడీపీ పార్టీ స్థాపించాక తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని.
అంతకుముందు తెలుగువారిని మద్రాసీలు అనే వారిని గుర్తు చేశారు.ఎన్టీఆర్ వారసునిగా తెలుగుదేశం పార్టీలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
తాత ఎన్టీఆర్ అంతా మంచి పేరు తెచ్చుకోలేకపోవచ్చు కానీ ఆయనకు మాత్రం చెడ్డ పేరు తీసుకురానని లోకేష్ స్పష్టం చేశారు.
జనవరి 27 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.400 రోజులు 4000 కిలోమీటర్లు “యువగళ్ళం” పేరుతో… యాత్ర చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.దీంతో మంగళగిరికి కొద్దిగా దూరం అవుతానన్న బాధ ఉన్నాగాని.
మిగత రాష్ట్ర ప్రజలందరినీ కలుసుకునే అవకాశం ఉందని అన్నారు.నేను ఎక్కడ ఉన్నా… నా మనసు మంగళగిరిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికలలో నన్ను గెలిపించండి రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తాను అని లోకేష్ హామీ ఇచ్చారు.