వైరల్: లేడీ బాహుబలిని ఎపుడైనా చూశారా? చూడకపోతే ఇక్కడ ఓ లుక్కేయండి!

భారతీయులు బాహుబలి సినిమానీ( Baahubali ) మరువలేరు, అదేవిధంగా బాహుబలి పాత్రను పోషించిన ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ ని కూడా మరువలేరు.అవును, “బాహుబలి” సినిమా ఒక్క మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

 Women Lifting Heavy Wooden Logs Video Viral Details, Woman's, Talent, Viral Late-TeluguStop.com

ఇక ఆ సినిమాలో ప్రభాస్ శివలింగం ఎత్తడం, రథాన్ని లాగడం, భల్లాలదేవ విగ్రహం ఎత్తడం వంటి బలప్రదర్శనలు జనాలు అంత త్వరగా మర్చిపోలేరు.ఇక ఒకవేళ నిజ జీవితంలో కూడా ఎవరైనా అలాంటి పనులు చేస్తే వారిని వారిని ఇపుడు “బాహుబలి”తో పోల్చడం పరిపాటిగా మారిపోయింది.

ఇపుడు ఈ విషయం అంతా ఎందుకని అనుకోకండి.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోని గమనిస్తే విషయం మీకే బోధపడుతుంది.ఆ వీడియోని చూస్తే మీకు లేడీ బాహుబలి( Lady Baahubali ) పరిచయం కాగలదు.కాగా ఆమె బలం చూసి నెటిజన్లు నివ్వెర పోతున్నారు మరి.వైరల్ అవుతున్న ఆ వీడియోని ఒకసారి గమనిస్తే యువతి అడవిలో ఉండడం మనం చూడవచ్చు.అక్కడ ఆమె 2 బలమైన దుంగలను ఎవరి సహాయమూ లేకుండా పైకి ఎత్తి ఓ తాడుతో కట్టి, అనంతరం ఆ భారీ దుంగలను కట్టిన తాడును తన భుజాలకు తగిలించుకుంది.

ఆ ఘటనను ఆమె స్నేహితురాలు వీడియో తీసి సోసల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ఇపుడు బాగా వైరల్ అవుతోంది.

ఫన్నీ X పోస్ట్ అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ కాగా ప్రస్తుతం ఈ వీడియోని జనాలు తెగ చూసేస్తున్నారు.ఇప్పటివరకు సదరు వీడియోని 40 వేల మందికి పైగా వీక్షించడం కొసమెరుపు.దాంతో ఈ వీడియోలోని మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆమె రియల్ బాహుబలి అని కొందరంటుంటే, సూపర్ పవర్ అని కొందరు, అడవి మీద ఆధారపడి జీవించేవాళ్ల భుజాలు చాలా బలంగా ఉంటాయి అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube