వైరల్: అద్భుతం, కాలికి తాచుపాము చుట్టుకోవడంతో శివ నామస్మరణ చేసిన మహిళ!

సర్పాలకు, హిందూ సంప్రదాయంలో చాలా ప్రత్యేక స్థానం వుంది.అందుకే ఇక్కడ నాగులను దేవతలవలె పూజిస్తారు.

 Woman Calmly Prays To Lord Shiva As King Cobra Wraps Around Her Leg Details, Vir-TeluguStop.com

ఇక నార్త్ ఇండియాలో చూసుకుంటే శ్రావణ సోమవారం నాడు శివయ్య పూజకు అత్యంత ఫలవంతంగా నాగులను భావిస్తారు.ఆరోజు భక్తి శ్రద్దలతో శివుడిని పూజిస్తారు.

ఈ క్రమంలోనే శ్రావణ సోమవారం రోజున ఉత్తర్ ప్రదేశ్‌లో( Uttar Pradesh ) ఒక వింత సంఘటన చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.కాగా దానికి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ వీడియో నెటిజన్లను చాలా తీవ్రంగా ఆకర్షిస్తోంది.

వైరల్ అయిన వీడియోని ఒకసారి మనం గమనిస్తే, ఒక పాము( Snake ) మహిళ కాలికి చుట్టుకుని సుమారు 3 గంటల పాటు అలాగే ఉండడం మనం గమనించవచ్చు.పాముని చూసి ఆమె భయపడకుండా అస్సలు కదలకుండా నిటారుగా కూర్చుని శివ నామాన్ని( Shiva Namam ) జపిస్తూనే ఉండడం కొసమెరుపు.ఇది గమనించిన బంధువులు వెంటనే పాము పట్టే వ్యక్తికి ఫోన్ చేశారు.ఆ పాములు పట్టే వ్యక్తికి వచ్చి మహిళ కాలికి చుట్టుకున్న పామును పట్టుకోవడం జరిగింది.

దీంతో ఆ మహిళ హమ్మయ్య అనుకొని ఊపిరి తీసుకుంది.కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది.

ఇకపోతే అంత విషపూరితమైన పాము( Poisonous Snake ) మహిళ కాలికి చుట్టుకుని వున్నా కూడా ఆమెని యేమి చేయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.విషయంలోకి వెళితే, ఈ మొత్తం వ్యవహారం సంగం సదర్ తహసీల్‌లోని దహ్రా గ్రామంలో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.హమీర్‌పూర్ జిల్లా దేవిగంజ్ గ్రామంలో నివసించే మిథిలేష్ కుమారి యాదవ్( Mithilesh Kumari Yadav ) రాఖీ పండగ( Rakhi Festival ) సందర్భంగా సొంత ఇంటికి వచ్చింది.ఈ క్రమంలో ఆమె నిద్రిస్తున్న సమయంలో పాము ఆ మహిళ కాలికి చుట్టుకుంది.

తన కాలికి చుట్టుకున్న విషసర్పాన్ని చూడగానే మిథిలేష్‌కి శివుడు గుర్తుకొచ్చాడు.వెంటనే ఆమె పాముని చూస్తూనే శివయ్యను ధ్యానిస్తూనే అలా ఉండిపోయింది.

అది అసలు విషయం ఇక ఆ సర్పం ఆమెని ఏమీ చేయకపోవడంతో అంతా ఆ శివయ్య మహిమేనని ఆమె చాలా ఆనందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube