అధికారమే లక్ష్యంగా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ తన వాహనం వారాహిని సిద్దం చేస్తూ ఉన్నారు.తన ఇష్ట దైవం కొండగట్టు నుంచి వారాహి యాత్ర కొనసాగిస్తా అని క్లారిటీ ఇచ్చారు.
అంతే కాకుండా తెలంగాణలో నిర్ణీత స్థానాల్లో పోటీకి పార్టీ నిలిచుంటుంది అని ప్రకటించారు.
దాంతో పవన్ ఫ్యాన్స్ లో జోష్ నిండింది.
వారాహి యాత్ర పవన్ కు పగ్గాలు దక్కించుకోవడం మాటేమిటో గానీ.ఒక్క చోట తేడా కొడుతోంది.
పవన్ తెలంగాణ లో పోటీ చేస్తాం అని ప్రకటించడమే ఆయనకు మైనస్ గా మారే అవకాశం ఉంది అని విశ్లేషకులు అంటున్నారు.తెలంగాణ లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రా లో ఎన్నికలు జరగనున్నాయి.
దాంతో ఆయన పార్టీ తెలంగాణ లో ప్రబావం చూపే విధానం బట్టి.ఆంధ్రాలో పార్టీ భవిష్యత్తు ఉంటుంది.అందుకే ఆయన అచి తుచి అడుగులు వేస్తున్నారు.ఈ సారి ప్రత్యక్షంగా ఎన్నికల్లో దిగడమా.? లేక ఏదైనా పార్టీ కి మద్దతు ఇవ్వడమా.? అనే దానిపై చర్చించే ఛాన్స్ ఉంది.
ఆంధ్రాలో పవన్ చంద్రబాబుతో పొత్తు దాదాపు ఖరారు కావడం తో.తెలంగాణ ప్రభావం తమ పొత్తు మీద ఉంటుంది అని చంద్రబాబు ముందుగానే సూచించినట్టు తెలుస్తోంది.మరి వారాహి. నారా వారి మాట వింటుందా.? లేక పోటీకి నిలబడుతుందా చూడాలి.