పవన్ పై జగన్ కు అంత కోపం ఎందుకు వచ్చిందో ..?

వైసీపీ- జనసేన ఈ రెండు పార్టీలు ఎన్నికల సమయంలో రాజకీయ పొత్తు పెట్టుకోబోతున్నాయి.ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి అంటూ ఆ రెండు పార్టీల మధ్య సీట్ల బేరం కూడా జరుగుతోంది అంటూ వస్తున్న వార్తలకు ఒక్కసారిగా తెరపడింది.

 Why Ys Jagan Serious Comments On Pawan Kalyan-TeluguStop.com

పవన్ పై జగన్ ఒక్కసారిగా తన మాటలతో విరుచుకుపడడంతో ఆ పొత్తు చిత్తయ్యింది అనే సంకేతాలు అందరికి అందాయి.అంతే కాదు ఇక ఆ రెండు పార్టీలు రాజకీయ ప్రత్యర్థులే అన్న స్పష్టమైన సమాధానం అందరికి ఇచ్చేసినట్టు అయ్యింది.

కార్లు మార్చినట్లు పెళ్లాలని మారుస్తారని.పవన్ కల్యాణ్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం సంచలనం రేపుతోంది.

వైసీపీ- జనసేన నాయకులు పోటాపోటీగా మీడియా ముందుకు వచ్చి మరీ తిట్టేసుకుంటున్నారు.

ఒక్కసారిగా జగన్ ఇలా కంట్రోల్ తప్పిపోవడం వెనుక కారణాలేమిటన్నదానిపై.ఆ పార్టీ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.జగన్ పిలుపునిచ్చిన బంద్ కు .ఏ మాత్రం స్పందన లేకపోవడం వల్ల ఆందోళనకు గురై ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.బంద్ సక్రమంగా జరగకపోవడంతో ఉదయం నుంచి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తునట్టు తెలుస్తోంది.

తనకు పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే జగన్ లా పారిపోయేవాడిని కాదన్న పవన్ విమర్శలు కూడా జగన్ కు గట్టిగా తగిలినట్టు సమాచారం.

ఇప్పుడు తన నిర్ణయంపై పవన్ కూడా.

విమర్శలు చేయడంతో జగన్ కంట్రోల్ తప్పిపోయారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు.

కానీ ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి.

ఏదైనా బావిలో దూకమని.వివాదాస్పదంగా మాట్లాడేవారు.

నంద్యాల ఉపఎన్నికల్లో.నిలబెట్టి కాల్చినా తప్పులేదని.

విమర్శించారు.ఇలాంటి వాటిపై ఎప్పటికప్పుడు విమర్శలు వచ్చినా జగన్ మాత్రం అవేవీ పట్టించుకోవడంలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube