రైలు వస్తుందా…రావడం లేదా అని పట్టించుకోకుండా కొందరు నిర్లక్ష్యంగా రైలు పట్టాలు దాటుతుంటారు.ఇందులో భాగంగా కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు.
అయినా ట్రాక్ పై నడవడం మాత్రం మానుకోవడంలేదు.ఇలాగే… రైల్వే ట్రాక్ దాటుతూ తృటిలో మృత్యువును తప్పించుకుంది ఓ అమ్మాయి.
ముంబై లోని కుర్లా రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన జరిగింది.బాండూప్ కు చెందిన ప్రతిక్ష నటెకర్ కుర్లాలోని తన ఫ్రెండ్ ను కలవడానికి వచ్చింది.
తిరిగి బాండూప్ వెళ్లడానికి కుర్లా స్టేషన్ లోని 7 వ నెంబర్ ప్లాట్ ఫాం కు వెళ్లడానికి ట్రాక్ ను క్రాస్ చేస్తున్నది.అదే సమయంలో ఆ ట్రాక్ పై నుంచి ఎదురుగా గూడ్స్ రైలు వచ్చింది.
చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉండటంతో ఆ ట్రాక్ పై వచ్చే గూడ్స్ ను చూడలేదు ప్రతిక్ష.ఫ్లాట్ ఫాం పై ఉన్న ప్రయాణికులు ప్రతిక్ష ను గమనించి కేకలు వేశారు.
అంతలోనే ట్రైన్ తన దగ్గరికి వచ్చేసింది.
గూడ్స్ డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేసినా ఫలితం లేకపోయింది.ట్రైన్ ప్రతిక్షను తాకడంతో.ట్రాక్ మధ్యలో పడిపోయింది.
మీద నుంచి రెండు మూడు బోగీలు వెళ్లిన తర్వాత ట్రైన్ ఆగిపోయింది.ఆమె ఖచ్చితంగా చనిపోయుంటుందని భావించారు ప్రయాణికులు.
ప్రతిక్ష అరుపులు విన్న వాళ్లు వెంటనే ఆమెను ట్రైన్ కింది నుంచి బయటకు లాగారు.ట్రైన్ బలంగా తాకడంతో ఎడమ కన్నుకు చిన్నగాయం అయింది.
పెద్ద పెద్ద గాయాలు ఏం కాలేదు.వెంటనే బాధితురాలిని దగ్గర్లోని రాజావాడి హాస్పటిల్ కు తరలించారు.
ఈ ఘటన అంతా రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.







