ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తన రాజకీయ వ్యూహాలు మార్చుతూ రాజకీయంగా తన ప్రత్యర్థులను కంగారు పెట్టించడం లో తెలంగాణ సీఎం కేసీఆర్ ని మించిన బలమైన రాజకీయ నాయకుడు మరొకరు కనిపించరు.ఇప్పుడు అయన ప్రతిపక్ష పార్టీలకే కాదు సొంత పార్టీ నేతల్లో కూడా కంగారు పెట్టించే చర్యలకు పూనుకున్నాడు.
దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో ఆందోళన పెరిగిపోయింది.ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో కేసీఆర్ తన తెలివితేటలకు పదునుపెట్టి మరీ కొత్త కొత్త ప్లాన్ లు గీస్తున్నాడు.
ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే రెండు సర్వేలు చేయించిన కేసీఆర్.తాజాగా మరో సర్వే రిపోర్ట్ కూడా తన దగ్గర పెట్టుకున్నాడట.సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ మరోసారి టిక్కెట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పాడు.కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పనితీరు బాగున్న ఎమ్మెల్యేలకు మాత్రమే టిక్కెట్లు ఇస్తారనేది పార్టీలో తీవ్రంగానే వినిపిస్తోంది.
ఎమ్యెల్యేల పనితీరుపై కొత్తగా ఓ సర్వే చేయించిన కేసీఆర్ దానికి సంబందించిన రిపోర్టులు అన్ని తన దగ్గర పెట్టుకున్నాడు.అయితే అన్ని సర్వేలకంటే ఈ సర్వేపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో బాగా ఆసక్తి పెరిగింది.
ఎందుకంటే, ఎన్నికల ముందు జరిగిన చివరి సర్వే ఇదేననీ, దీని ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపు ఉంటుందనే చర్చ ఎమ్మెల్యేల్లో చాలా తీవ్రంగా ఉంది.

కేవలం పనితీరు ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది కేసీఆర్ ఇదివరకే చెప్పడంతో, ఎన్నిక సమయంలో అసంతృప్తులకు తావు లేకుండా.ఇప్పట్నుంచే పరిస్థితిని అదుపులోకి తేవడమే తాజా సర్వే లక్ష్యంగా తెలుస్తోంది.ఈ వారంలోనే సర్వే వివరాలు బహిర్గతం చేస్తారట.
దీంతో ఎవరి టిక్కెట్లు దక్కవో అనేది దాదాపు ఒక స్పష్టత వచ్చేస్తుందనే ఆసక్తి టీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది.గతంలో రెండు సర్వేలు నిర్వహించి.
పనితీరు బాగులేని ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ తీసుకున్నారు.
అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే తాను చేయగలిందేమీ లేదనే సంకేతాలు కూడా ఇస్తున్నారట టీఆర్ఎస్ అధినేత.
అంతే కాదు … సర్వే పత్రాలు చేతిలో పెట్టుకుని.ఇలాంటి లీకులు ఇస్తూ, ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపించి పనిచేసే విధంగా ప్రేరేపించడం కేసీఆర్ కి మాత్రమే చెల్లింది.
మరోసారి టికెట్ దక్కాలంటే పనిచేసి తీరాలనే ఆందోళనను వారి మనస్సులో కేసీఆర్ కలుగజేశారు.