రజినీకాంత్, శ్రియ జంటగా నటించిన చిత్రం శివాజీ.ఈ చిత్రంలో హీరోను మించి విలన్ పాత్ర లో సుమన్ చక్కగా నటించాడు.
రజిని నటన గురించి, స్టైల్ గురించి కొత్తగా మాట్లాడేం ఉంటుంది.ఆయనకు అది వెన్నతో పెట్టిన విద్య.
ఎటొచ్చి సుమన్ హీరో గా తొలినాళ్లలో పడిన ఇబ్బందులు మనం చూసాం.అయన వ్యక్తి గత జీవితం లో జరిగిన చేదు సంఘటనలు అయన కెరీర్ ని కూడా బాగా దెబ్బ కొట్టాయి.
జైలు జీవితం లో ఎంతో నరకం అనుభవించి బయటకు వచ్చాక ఆయను కొంతమేర ఎవరు నమ్మి అవకాశాలు ఇవ్వలేదు.
కానీ తెలుగు ప్రముఖ రచయిత అయన పరిస్థితిని గమనించి అయన మనవరాలికి ఇచ్చి వివాహం చేసారు.
ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లో మళ్లి బిజీ అయినా ఆశించిన మేరకు స్టార్ డం సంపాదించుకోలేదు.ఇక తెలుగులో మాత్రమే హీరోగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ గా మారారు.
అయితే తమిలలో శివాజీ చిత్రంలో విలన్ పాత్ర తో రీఎంట్రీ ఇచ్చిన సుమన్ మంచి స్టైలిష్ గా కనిపిచ్చాడు.ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయాల్సిందిగా తొలుత దర్శకుడు శంకర్ సుమన్ అవకాశం ఇచ్చాడు.
అంతే కాదు గడ్డం, మీసం లేకుండా కల్లద్దాలతో, పళ్లకు ఎక్స్ట్రా తొడుగు లాంటిది ధరించాలని చెప్పడం తో సుమన్ కాస్త కంగారు పడ్డాడట.గడ్డ, మీసం మరియు పళ్ళ వరకు ఒకే కానీ కళ్ళద్దాలతో చేయాలంటే నో చెప్పడాట.
ఎందుకంటే మనం చేసే నటన మన కళ్ళను చూస్తేనే అర్ధం అవుతుందని, హావభావాలు చక్కగా కనిపిస్తాయని లేకపోతే పాత్ర పండదు అని సుమన్ అభిప్రాయపడితే అందుకు శంకర్ ఒప్పుకోలేదట.నా మీద నమ్మకం ఉంచండి.మీకు ఈ పాత్ర చాల బాగా సూట్ అవుతుందని చెప్పారట.వెంటనే సుమన్ రజినీకాంత్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడం తో కళ్ళు మూసుకొని ఆ సినిమాలో నటించమని చెప్పాడట.
ఎందుకంటే ఈ సినిమాలో హీరో కన్నా కూడా విలన్ పాత్ర ఎక్కువగా హైలెట్ అవుతుందని, అది తన కెరీర్ కి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారట.రజిని చెప్పినట్టే ఈ చిత్రం విడుదల అయ్యాక సుమన్ నటన కు అందరు ఫిదా అయ్యారు.
ఈ తర్వాత ఫుల్ బిజీ స్టార్ గా కూడా మారారు.