Chandra Mohan : చంద్ర మోహన్ లాంటి ఒక గొప్ప నటుడికి పద్మశ్రీ కూడా ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన చంద్రమోహన్( Chandra Mohan ) ఇవాళ కన్నుమూశారు.తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన చంద్రమోహన్ బతికున్న కాలంలో తనకు పాలిటిక్స్, స్పోర్ట్స్ రెండూ అసలు ఇంట్రెస్ట్ లేని అంశాలు అని పేర్కొన్నాడు.

 Why No Awards To Chandra Mohan-TeluguStop.com

బిజినెస్ చేయాలని అనుకున్నా అది తనకు అచ్చి రాలేదని తెలిపాడు.అందుకే సాధ్యమైనంతవరకు సినిమాల పైన ఆధారపడ్డానని అన్నాడు.

చంద్రమోహన్ కి కెరీర్ మొత్తంలో ఆరు నంది అవార్డులు రెండు ఫిలింఫేర్ అవార్డు లభించాయి.అయితే దాదాపు వేయి సినిమాల్లో నటించి మూవీ ఇండస్ట్రీకి విశేష సేవలు అందించినప్పటికీ అతనికి భారతదేశ పౌర అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్ వంటి వాటిలో ఒకటి కూడా అందించలేదు.

Telugu Awards, Chandra Mohan, Padma Shri, Rangula Ratnam, Savitri, Tollywood-Lat

అయితే వీటిలో ఏది ఇచ్చినా తాను వద్దంటానని, ఏం అర్హత ఉందని తనకు ఆ పురస్కారాలు ఇస్తారని ఒకానొక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ప్రశ్నించాడు.గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ, ఎం.బాలయ్య, ఎస్వీఆర్, సావిత్రిల( Svr , Savitri ) వంటి దిగ్గజ యాక్టర్స్ కి కూడా కనీసం పద్మశ్రీ( Padma Shri )లు ఇవ్వలేదని, అవార్డుకు వారు అనర్హులు ఎలా అవుతారని కూడా ప్రశ్నించాడు.పద్మ పురస్కారాలుగా అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వటం తక్కువ, లేని వారికి ఇవ్వడం ఎక్కువ అన్నట్లు ఒక ఇంటర్వ్యూలో తన అసహనాన్ని చంద్రమోహన్ వెళ్ళగక్కాడు.

పవర్ స్టార్, సూపర్ స్టార్ నట సామ్రాట్ వంటి బిరుదులు కూడా తనకి అవసరం లేదని పేర్కొన్నాడు.సన్మానం చేసి బిరుదులు ఇస్తామని కొందరు చెప్పినా వాటిని తాను సున్నితంగా తిరస్కరించాలని చెప్పాడు.

Telugu Awards, Chandra Mohan, Padma Shri, Rangula Ratnam, Savitri, Tollywood-Lat

చాలామంది నటులు డాక్టరేట్ కూడా పొందుతున్నారని,అసలు సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారని వాటిని తగిలించుకుంటున్నారు? అని కూడా అతని ప్రశ్నించాడు.అలాంటివి కూడా తనకు అసలు ఇష్టం ఉండదని స్పష్టం చేశాడు.చంద్రమోహన్ గా పుట్టిన తాను చంద్రమోహన్ గానే సినిమా నుంచి రిటైర్ అవుతానని, తన పేరు ముందు వెనక ఎలాంటి బిరుదులు అవసరం లేదని ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టాడు.నిజానికి చంద్రమోహన్ కంటే తక్కువ అర్హత గల వారికి పద్మశ్రీ అవార్డులను( Padma Shri ) భారత ప్రభుత్వం అందజేసింది.

చంద్రమోహన్ కాస్త ఎత్తు తక్కువ ఉన్నాడు కానీ ఒక అర అడుగు ఎత్తు ఉన్నట్లయితే సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా సంచలనాలు క్రియేట్ చేసి ఉండేవాడు.అతని ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే.

ఆయన సేవలకు, ప్రతిభకు గుర్తుగా ప్రభుత్వం ఒక్క అవార్డు అయినా అందించి ఉంటే బాగుండేది.దక్కవలసిన ఏ అవార్డ్ ఇవ్వకపోవడం, కనీసం పద్మశ్రీ వంటివి చంద్రమోహన్ కు ప్రధానం చేయకపోవడం నిజంగా ప్రభుత్వ వివక్షతకు నిదర్శనమే అని ఇప్పటికే చాలామంది అభిప్రాయపడుతుంటారు.

అంతేకాదు, ఈ నటుడు వాటి కోసం ఎన్నడూ ప్రాకులాడలేదు, ఎలాంటి రికమండేషన్స్ కూడా చేయడానికి ఇష్టపడలేదు.ఈ రెండు కారణాల వల్లే అతనికి ఈ పురస్కారాలు రాలేదని కూడా చెప్పుకోవచ్చు.

ఏది ఏమైనా ప్రేక్షకులు అతను నటించిన మంచి సినిమాలు చూసి ఎప్పుడో అత్యున్నత పౌర పురస్కారాలు ఇచ్చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube