కారు ప్రయాణంలో నిద్ర ఎందుకు వ‌స్తుందో తెలుసా?

కారులో ప్రయాణిస్తున్న‌ప్పుడు చాలామందికి నిద్ర వ‌స్తుంటుంది.ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీనిపై భిన్నమైన పరిశోధనలు జరిగాయి.పరిశోధనల్లో అనేక ఆస‌క్తిక‌ర విషయాలు వెల్లడయ్యాయి.ఇది జరగడానికి కారు వేగం, శ‌రీర‌పు విసుగు,హైవే హిప్నాసిస్ మొద‌లైన‌వి కారణాలుగా తేలాయి.ప్రయాణానికి ముందు చాలా సన్నాహాలు చేస్తారు.ఏదో మిస్స‌వుతుంద‌నే ఆలోచ‌న‌తో నిద్ర స‌రిగా ప‌ట్ట‌దు.

 Why Do We Always Fall Asleep In Cars Know The Science Behind Details, Cars, Slee-TeluguStop.com

దీనినే స్లీప్ డెట్ అంటారు.కారులో నిద్ర రావడానికి ఇదే అతి పెద్ద కారణం, ఇప్పుడు దీనిని సైన్స్ ద్వారా అర్థం చేసుకుందాం.

కదులుతున్న వాహనంలో నిద్ర వస్తుంది అంటుంటారు.రాత్రి నిద్రపోయే సమయానికి మనస్సు,శరీరం రిలాక్స్ అవుతాయి.

కారులో ఏర్ప‌డే కదలిక కూడా నిద్రను ప్రేరేపించడానికి పని చేస్తుంది.

చిన్న పిల్ల‌ల‌ను నిద్ర‌పుచ్చేందుకు వారి తల్లిదండ్రులు వారి చేతుల్లోకి తీసుకుని ఊపుతుంటారు.

దీంతో వారు నిద్ర‌లోకి జారుకుంటారు.సైన్స్ భాషలో ఈ పరిస్థితిని హైవే హిప్నాసిస్ అంటారు.

ఇది డ్రైవర్లకు కూడా ఎదుర‌వుతుంది.సుదూర ప్రయాణంలో వాహ‌నం నడుపుతున్న వారు నిద్రపోతుంటారు.

అయితే టీ, కాఫీలు తాగి నిద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తారు.ప్రయాణంలో ఇలా నిద్రపోవడానికి మూడో కారణం వైట్ వాయిస్‌.

ఇంజిన్ నుంచి వ‌చ్చే శబ్దం, గాలి శబ్దం, వాహనంలో వినిపించే సంగీతం ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దాన్ని వైట్ నాయిస్ అంటారు.

Telugu Car Velocity, Cars, Science, Sleep Disorder, Sleep Car, Sleep Journey, So

ఇటువంటి శబ్దం మ‌ధ్య‌ ఒక వ్యక్తి ఎలా నిద్రపోతాడో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.చిన్న‌పిల్ల‌ల‌ను నిద్ర‌పుచ్చేందుకు తల్లిదండ్రులు వివిధ రకాల శబ్దాలు చేస్తారు.దీంతో పిల్ల‌లు నిద్రపోతార‌ని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు.దూర ప్రయాణాల్లో నిద్ర రావడం సహజమే అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఎవరైనా 10-15 నిమిషాల ప్రయాణంలో కూడా నిద్రపోలేక‌పోతే అప్పుడు వారు సోపిట్ సిండ్రోమ్‌తో బాధపడే ప్రమాదం ఉంది.ఇది నాడీ సంబంధిత రుగ్మత.

ఈ స్థితిలో మ‌నిషి త్వ‌ర‌గా అల‌సిపోతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube