కమ్యూనిస్ట్ కంచుకోటలను బద్దలు కొట్టి.కమళనాథులు.
త్రిపురలో కాషాయ జెండా పాతారు.పాతికేళ్లుగా త్రిపురను పాలిస్తున్న మాణిక్ సర్కార్ ను పక్కన పెట్టి మరి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు.
అయితే బీజేపీకి అధికారం రావడం వెనుక చాలా కష్టం దాగుంది.సుమారు మూడేళ్లు ముందుగానే.
ఆర్ఎస్ఎస్ అక్కడ పాగా వేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.గ్రామగ్రామాన శాఖలు పెట్టి యువతను ప్రభావితం చేసింది.
స్వదేశీయతను వాళ్లలో పెంచి.కమ్యూనిస్ట్ కోటలను బద్దలు కొట్టింది.దాంతో కమ్యూనిస్ట్ కంచుకోటగా ఉన్న త్రిపుర కాషాయ గూటికి చేరింది.మొట్టమొదటి సారి బీజేపీ నుంచి ఆ రాష్ట్రంలో విప్లవ్ దేవ్ కుమార్ సీఎం పీఠమెక్కారు.
అయితే ఆయన అందలమెక్కిన వెంటనే.రాష్ట్రంలోని లెనిన్, మావో విగ్రహాలను తొలగించారు.
అప్పట్లో అది తీవ్ర దుమారం రేపినా.ఆయన వెనక్కి తగ్గలేదు.
అదే దూకుడుతో పార్టీని ముందుకు నడిపారు.
ఇక ప్రజలను దాదాపు సంఘ్ పరివార్ లో చేర్పించేశారు.దెబ్బకు రెండు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్నారు.కమ్యూనిస్టులు ఓడిపోయేనాటికి చిన్న చిన్న తేడాలతో ఓడినా.
అది లోక్ సభ ఎన్నికల నాటికి వారి ఓట్ షేర్ భారీగా పతనమయింది.విప్లవ్ దేవ్ తీసుకున్న దూకుడు నిర్ణయాలు కొంత పార్టీకి నష్టం చేసిన.
గట్టి పునాదులు వేశాయి.
దాంతో అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయడానికి సహాను సీఎం ను చేశారు.విద్యావంతుడు కావడంతో ఆయన పార్టీని మరో శైలిలో నడపడం మొదలు పెట్టారు.దాంతో ఆ రాష్ట్రంలో బీజేపీకి మరో సారి అనుకూల గాలి వీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక మాణిక్ సర్కార్ సౌమ్యుడు కావడం.కాంగ్రెస్ పార్టీ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో.
ఈ సారి కూడా బీజేపీనే అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.