హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న టీమ్ లీడర్ ఎవరంటే..?

టెలివిజన్ చరిత్రలోనే అత్యంత పెను మార్పు ఏదైనా జరిగిందా అంటే అది ఖచ్చితంగా జబర్దస్తు షో( Jabardastu show ) అనే చెప్పాలి.అప్పటి వరకు ఇంట్లో అందరు టీవీ సీరియల్స్ చూస్తూ టైంపాస్ చేసేవారు ఆ సీరియల్స్ ఎప్పుడు ఏడుపుగ గొట్టుగానే ఉండేవి దాంతో ఇంట్లో ఆడవాళ్ళ చేతులో ఉన్న రిమోట్ మార్చాలి అని ఉన్న మార్చలేని మగాళ్లు సీరియల్స్ చూడాలి అని లేకున్నా ఏం చేయలేక వాళ్ళతో పాటే ఆ సీరియల్స్ చూసేవారు కరెక్ట్ గా అలాంటి టైం లోనే వచ్చింది జబర్దస్తు షో కామెడీగా ఉంటూ అందరిని నవ్విస్తూ చాలా సరదాగా ఉండడంతో ఇంట్లో ఉన్నమగాళ్ళకి కాస్త రిలాక్స్ దొరికినట్టు అయింది.

 Who Is The Team Leader Who Got More Remuneration Than Hyper Adi, Chammak Chandra-TeluguStop.com

ఆ తర్వాత ఈ షో ఆడ మగా అని తేడా లేకుండా అందరిని ఆకట్టుకుంది.అలా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అయింది.

జబర్దస్తు షో స్టార్ట్ అయి పది సంవత్సరాలు కాబోతుంది.ఈ కార్యక్రమాన్ని మొదట 13 ఎపిసోడ్లు చేయాలని భావించి ఒప్పందాలు చేయడం జరిగింది.

 Who Is The Team Leader Who Got More Remuneration Than Hyper Adi, Chammak Chandra-TeluguStop.com
Telugu Chammak Chandra, Hyper Adi, Jabardastu Show, Mallemala-Latest News - Telu

అప్పుడు టీం లీడర్లతో పాతిక వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ మాట్లాడుకుని మల్లెమాల( Mallemala ) వారు కార్యక్రమాన్ని రూపొందించారు.కార్యక్రమం ప్రారంభమైన రెండు మూడు వారాలకే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.దాంతో టీం లీడర్ల యొక్క రెమ్యూనరేషన్ కూడా పెంచారు.చమ్మక్ చంద్ర( Chammak Chandra ) కారణంగా జబర్దస్త్ క్రేజ్ విపరీతంగా పెరిగింది.అందుకే ఆయనకు అప్పట్లోనే ఏకంగా లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ ని ఇచ్చేవారట.ఆ స్థాయిలో సుడిగాలి సుదీర్( Sudigali Sudheer ) మరియు హైపర్ ఆది.

Telugu Chammak Chandra, Hyper Adi, Jabardastu Show, Mallemala-Latest News - Telu

టీం లకు మాత్రమే మల్లెమాల వారు రెమ్యూనరేషన్ ఇస్తూ వచ్చారు.హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యాడు.ఆయన జబర్దస్త్ కి దూరమైన సమయంలో తీసుకున్న రెమ్యూనరేషన్ ఒక్కొక్క ఎపిసోడ్ కి రెండు లక్షల రూపాయలు.గతంతో పోలిస్తే కాస్త తక్కువే అయినా కూడా ఇతర కార్యక్రమాల్లో వరుసగా ఆయన చేస్తున్నాడు కనుక మల్లెమాల వారు రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి ఆయన టీమ్ లో ఇతర ముఖ్య నటినటులకు అదనంగా రెమ్యూనరేషన్ ఇచ్చేవారట.

హైపర్ ఆది వెళ్లి పోవడంతో ఆయన స్థానంలో సద్దాం టీం బరిలోకి దిగింది.ఇప్పుడు సద్దాం కి కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా రెండున్నర లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ దక్కుతుందని తెలుస్తుంది.

Telugu Chammak Chandra, Hyper Adi, Jabardastu Show, Mallemala-Latest News - Telu

టీం లీడర్ కి రెండున్నర లక్షల రూపాయలు ఇస్తున్నారు అలాగే అందుతున్న సమాచారం ప్రకారం సద్దాం టీం లోని యాదమ రాజుకి 25 వేల రూపాయలు ఇస్తున్నట్టు మిగిలిన వారికి కూడా వాళ్ళ క్రేజ్ ని బట్టి చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది.మొత్తానికి హైపర్ ఆది స్థానంలో వచ్చిన సద్దాం రెమ్యూనరేషన్ లో అసలు తగ్గేదెలేదు అంటున్నాడు.ఇలా జబర్దస్తు షో లో టీం లీడర్లుగా కర్టెస్టెంట్ లు గా చేస్తూనే చాలా డబ్బులు సంపాదించినవారు కూడా ఉన్నారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube