ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు నాగార్జున. 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంక యువ హీరోలకు పోటీ ఇస్తూ.
అమ్మాయిల అందరికీ కూడా మన్మధుడు గానే కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం కేవలం హీరోగా మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలతో హోస్ట్ గా కూడా సత్తా చాటుతూ ఉన్నాడు.
కాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున.ఈ ఏడాది తన కొడుకు నాగచైతన్య తో కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.
కాగా నాగార్జునను యంగ్ హీరో నమ్మించి మోసం చేశాడు అన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది.కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటించాల్సి ఉందట.
నిజానికి అయితే ఆ పాత్ర రజినీకాంత్ చేయాల్సింది.కాని సూపర్ స్టార్ రజినీకాంత్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో నాగార్జునను ఆ పాత్ర కోసం తీసుకుంటే బాగుంటుందని భావించాడట ధనుష్.
ధనుష్ నాగార్జున తో పాటు ఈ సినిమాలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అదితి రావు హైదరి లు కూడా నటిస్తారు అన్న వార్త కూడా బలంగా వినిపించాయ్.

ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పాలి.కొంత భాగం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగిందట.తర్వాత ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
నిర్మాతలతో కొన్ని ఇబ్బందులు ఏర్పడటం కారణంగానే ధనుష్ సినిమాను నిలిపి వేసాడు అన్న వార్తలు తెరమీదకు వచ్చాయి.లేదు ధనుష్ కావాలని ఈ ప్రాజెక్టుని ఆపేసాడు అంటూ టాక్ కూడా వినిపించింది.
అయితే ఈ సినిమా షూటింగ్ ను ఆపేసినట్లు అటు నాగార్జునకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట.దీంతో ధనుష్ వ్యవహరించిన తీరుతో నాగార్జున బాధపడినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.