ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని, మరో భాషలో మరో హీరో రీమేక్ చేయడం కొత్తేమి కాదు.తెలుగులో హిట్ అయిన చిత్రాలు తమిళ, కన్నడ, హిందీ భాషలలో రీమేక్ చేస్తే, ఆ భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను, మన హీరోలు కూడా రీమేక్ చేస్తూ ఉంటారు.
ఇలా ఒక భాషలో సూపర్ హిట్ అయిన చిత్రం, మరో భాషలో తెరకెక్కినప్పుడు అనేక విధమైన కంపారిసన్లు రావడం సహజం.కొందరు ఒరిజినల్ బాగుందంటే, మరికొందరు రీమేక్ బాగుందని అంటుంటారు.
ఇప్పుడు అదేవిధమైన చర్చలో హాట్ టాపిక్ గా మారింది రుద్రవీణ చిత్రం.
తెలుగు ఇండస్ట్రీ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా, ప్రముఖ దర్శకుడు కే బాలచాందర్ తెరకేక్కించిన చిత్రం “రుద్రవీణ”.
( Rudraveena ) ఈ చిత్రం 1988 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం ప్రేక్షకుల మనసులతో పాటు అనేక జాతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది.
తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది రుద్రవీణ.ఈ చిత్రానికి ఇళయరాజా( Ilayaraja ) అందించిన సంగీతం ఇప్పటికి ప్రేక్షకుల చెవులలో మారుమ్రోగుతూ ఉంటుంది.
ఐతే మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రాన్ని, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్( Kamal Haasan ) రీమేక్ చేసారు.“ఉన్నాల్ ముడియుం తంబి”( Unnal Mudiyum Thambi ) అన్న పేరుతో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం, అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.తెలుగులో శోభన చేసిన పాత్రను తమిళంలో సీత పోషించారు.హీరో తండ్రిగా ముఖ్య పాత్రలో రెండు భాషలలో జెమిని గణేశన్( Gemini Ganeshan ) నటించారు.ఐతే ఈ చిత్రాలలో కమల్ హాసన్ బాగా నటించారా…లేక చిరంజీవి బాగా నటించారా అంటే చెప్పడం ఎవ్వరి తరం కాదు.ఎందుకంటె, ఒక్కో నటుడికి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది.
ఒకరితో మరొకరిని పోల్చి చెప్పడం సరి కాదు.
ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో భోజనం చెయ్యడానికి వచ్చిన చిరంజీవి “నేను ఎవ్వరికోసం పస్తులు ఉండవలసిన అవసరం లేదు….నేను తింటా వదినా” అంటూ భోజనం చేసే సన్నివేశంలో ఆయన ముఖంలో పలికించిన హావభావాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.ఐతే ఇదే సన్నివేశంలో కమల్ హాసన్ మరోవిధంగా నటించారు.
కమల్ కూడా అద్భుతంగా నటించినప్పటికీ, ఈ సన్నివేశంలో చిరంజీవి గారు, కమల్ హాసన్ ను డామినెటే చేసారు అంటూ ట్విట్టర్ లో ఈ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు సినిమా అభిమానులు.