ఈ రెండు విషయాలను పూర్తిగా మర్చిపోయిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 )… తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద రియాలిటీ షోగా తమకు తాము చెప్పుకొని టీవీ రంగాన్ని అలాగే ప్రకటనల సామ్రాజ్యాన్ని కూడా పెద్ద మొత్తంలో ప్రభావితం చేస్తున్నారు.ఈ సారి సీజన్ ఉల్టా పుల్టా అనే పేరు పెట్టుకొని మరీ వచ్చింది.

 Big Boss Forgot About These Two Things, Bigg Boss , Bigg Boss Season 7, Confecti-TeluguStop.com

అయితే ఎప్పటి లాగానే పేలవమైన ప్రదర్శనతో ముందుకు కొనసాగుతుంది.ఇక షోలో అనేక తప్పులు జరుగుతున్నాయి.

అలాగే కంటెస్టెంట్స్ పద్ధతి కూడా ఏమాత్రం బాగోలేదు.

Telugu Big Boss Forgot, Bigg Boss, Prison, Tasty Teja-Telugu Top Posts

ఎన్ని జరిగినా బిగ్ బాస్ యాజమాన్యానికి మాత్రం చీమ కూడా కుట్టినంత ప్రభావం కనిపించడం లేదు.వారు చేసే పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.అయితే ఈసారి బాగా నోటీస్ చేస్తే కొన్ని తప్పులు క్లియర్ గా కనిపిస్తున్నాయి.

హౌస్ లో కన్ఫెషన్ రూమ్, జైలు అని రెండు ఉన్నాయని సంగతే బిగ్ బాస్ యాజమాన్యం మరిచిపోయినట్టుగా ఉంది.నిన్నటి ఎపిసోడ్ లో అమర్ వచ్చి కన్ఫ్ఫెక్షన్ రూమ్( Confection room ) కి రావడం ఇన్ని రోజుల్లో ఇదే మొదటిసారి అని చెప్పడంతో కన్ఫెషన్ రూమ్ కి అందర్నీ పిలవడం లేదు అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది.

ఇంతకు ముందు కన్ఫెషన్ రూమ్ లోనే నామినేషన్ ప్రక్రియ కూడా జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.అందువల్ల ఈసారి ఈ రూమ్ ని సరిగ్గా వాడుకోలేక పోయారు బిగ్ బాస్ టీం.జైలు( prison ) ను కూడా సరిగ్గా వాడుకోలేదు.

Telugu Big Boss Forgot, Bigg Boss, Prison, Tasty Teja-Telugu Top Posts

కేవలం టేస్టీ తేజాను( Tasty teja ) ఎదో ఒక టైంలో ఒక గేమ్ సరిగా ఆడటం లేదని, ఎప్పుడూ నిద్రపోతున్నాడని కారణంతో తోటి కంటెస్టెంట్స్ జైలు లో పెట్టాలని చెప్పారు తప్ప జైలు ఉన్న సంగతే మర్చిపోయారు బిగ్ బాస్ టీం.ఈ మాత్రం దానికి ఇంత ఖర్చుపెట్టి ఆ సెటప్ చేయడం ఎందుకు, అలా వాటిని మర్చిపోయి రకరకాల ఎంటర్టైన్మెంట్ లు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకోవడం ఎందుకు.అవి లేకపోయినా షోకి వచ్చే నష్టం లేదు.

కానీ వాటి కోసం భారీ మొత్తం ఖర్చు కేటాయించి సెటప్ చేయాలి.ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయిన టీం ని ఏమనాలో ప్రేక్షకులు నిర్ధారించుకుంటారిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube