చిన్నపిల్లలు ఎక్కువగా చిరుతిండిని తినడానికి బాగా ఇష్టపడతారు.మరి ముఖ్యంగా చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ విషయం అయితే చెప్పనవసరమే లేదు.
అవి కోనేదాకా ఊరుకోరు.అయితే పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని అదే పనిగా చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ కోనివ్వడం మంచిది కాదు.
పిల్లలకు కొనిచ్చే ఐస్ క్రీమ్స్, చాక్లెట్ల విషయంలో అందరు అప్రమత్తంగా ఉండాలి.ఎందుకంటే కొన్ని విషయాలు తెలిస్తే మీ గుండెల్లో రైళ్లు పరుగేడతాయి.
ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు తినే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ లలో డ్రగ్స్ కలుపుతున్నారు.
వివరాల్లోకి వెళితే.
చెన్నై మహానగరంలో డ్రగ్స్ చాక్లెట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.స్కూల్స్, కాలేజీల దగ్గరలో డ్రగ్స్ చాక్లెట్స్ అమ్ముతున్నారనే వస్తున్న వార్తల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయందోళనలో ఉన్నారు.
ఈ విషయం ఉన్నత అధికారులకు తెలియడంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.చుట్టూ పక్కల పరిసరాల్లో ఉన్న కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్‌లో రైడ్ నిర్వహించంగా ఊహించని రీతిలో అక్కడ చాక్లెట్స్ దర్శనం ఇచ్చాయి.
వాటిని చూసి అధికారులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.డ్రగ్స్ మిక్స్ చేసి అమ్ముతున్నారనే అధికారుల అనుమానం నిజం అయింది.

ఎందుకంటే అక్కడున్న జెల్లీస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్‌లలో వేటికి కూడాలేబుల్స్ లేవు.అలాగే అక్కడ పెద్ద మొత్తంలో జెల్లీలు,ఐస్ క్రీం, చాక్లెట్స్ లభించాయి.వాటిని స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.కాగా అసలు ఇలా లేబుల్స్ లేని ఐటమ్స్ ఎక్కడ నుండి సరఫరా అవుతున్నాయి.? ఎవరు తయారుచేస్తున్నారు అనే అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.ఇప్పటికే డ్రగ్స్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత ఈ మత్తు పదార్ధాలకు బానిసలుగా మరి వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యి ఇలాంటి మోసాలు ముందు ముందు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.