ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సినిమాలో ఉన్నంత వరకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది.ఒకవేళ ఇండస్ట్రీకి దూరమైతే ఇక వాళ్లను ఎవరు కూడా పట్టించుకోరు.
ఎవరు కూడా గుర్తుకు చేయరు.కానీ ఇండస్ట్రీకి దూరమైన కొందరి నటీనటులను మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
అందులో జయమాలిని ఒకరు.ఈమె గురించి ఇప్పటికీ ప్రేక్షకులు తలచుకుంటూనే ఉంటారు.
కొందరు నటీనటులు సినిమాలకు దూరం కావటానికి వ్యక్తిగత విషయాలు, ఇండస్ట్రీకి సంబంధించిన విమర్శల వల్ల సినిమాలకు దూరం అవుతుంటారు.కానీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వ్యతిరేకత ను అందుకొని జయమాలిని సినిమాలకు ఎందుకు దూరం అయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జయమాలిని. ముందుగా ఈమె నటన గురించి పక్కకు పెడితే ఆమె అందం గురించి వర్ణించలేము.ఇప్పటికీ ఈమెలో అదే తరగని అందం ఉంది.వయసు మీద పడ్డ కూడా ఆమెలో ఎటువంటి మార్పులు లేవు.ఈమె అసలు పేరు అలివేలు మంగ.ఈమె 1958లో డిసెంబర్ 22న జన్మించింది.
ఇక ఈరోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.తెలుగు సినీ ఇండస్ట్రీలో జయమాలిని నటిగా, శృంగార నృత్య తారగా నటించింది.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో కూడా నటించింది.ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈమె సోదరి జ్యోతిలక్ష్మి కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన నటి అని అందరికీ తెలుసు.ఇక జయమాలిని తొలిసారిగా హీరోయిన్ గా నటించగా ఆ తర్వాత డాన్సర్ గా నటించింది.ఆమెకు నటిగా కంటే డాన్సర్ గానే మంచి పేరు అందింది.తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
అలా ఆమె అన్ని భాషలలో కలిపి దాదాపు 600 పైగా సినిమాలలో నటించింది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలోనే నటించింది.
ఇక ఈమె చిన్ననాటి మిత్రుడైన పార్తిబన్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ ను పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత చెన్నైలోనే సెటిల్ అయ్యింది.
ఈమెకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా ఉన్నారు.

జయమాలిని కి పెళ్లి తర్వాత కూడా చాలా అవకాశాలు వచ్చాయి.కానీ ఆమె సినిమాలలో నటించలేనని చెప్పేసింది.ఈమె సినిమాలలో నటించనని చెప్పేసరికి ఎంతోమంది సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు చాలా బాధపడ్డారు.
ఇంతకూ ఆమె సినిమాల్లోకి మళ్ళీ ఎందుకు రాలేదంటే తన కుటుంబం కోసం అని గతంలో తెలిపింది.
పెళ్లి తర్వాత తన భర్త కూడా తనకు ఎటువంటి అడ్డంకులు చెప్పలేదని కానీ తానే తన కుటుంబం కోసం సినిమాల్లోకి తిరిగి రాలేనని తెలిపింది.
తన పిల్లలను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు జయమాలిని.కానీ ఇప్పుడు మాత్రం అవకాశం వస్తే ఒక మంచి పాత్రలో నటించడానికి సిద్ధమే అని తెలిపింది జయమాలిని.
మరి జయమాలిని ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.