వాట్సాప్‌ కొత్త ఫీచర్ షురూ.. ఇక వాటిని ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యం?

ప్రపంచ దిగ్గజ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp ) యూజర్ల ప్రైవసీమీద ఎక్కువగా ఆరోపణలు రావడంతో కొన్నాళ్లనుండి అదేపనిగా వినియోగదారుల భద్రతకు సంబందించిన అప్డేట్లను ఇస్తూ పోతోంది.ఈ క్రమంలో ఎప్పటికప్పుడు సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేస్తుండడం మనం గమనించవచ్చు.

 Whatsapp's New Feature Is Almost Impossible To Track, Whatsapp, Chat, Technology-TeluguStop.com

ప్రస్తుతం వాయిస్, వీడియో కాల్స్‌ కు మరింత ప్రైవసీని అందించే కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ ఫీచర్‌ని “ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్”( Protect IP Address in Calls ) అంటారు.

ఈ ఆప్షన్‌ ఎనేబుల్ చేసుకున్న యూజర్ల కాల్స్‌ ను సొంత సర్వర్‌ల ద్వారా వాట్సాప్ పంపుతుంది.తద్వారా కాల్‌లోని ఇతర వ్యక్తులు యూజర్ ఐపీ అడ్రస్ అనేది చూడడం ఎట్టి పరిస్థితుల్లో జరగదు.

Telugu Chat, Latest, Ups, Whatsapp-Latest News - Telugu

ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నెట్‌లో ఒక డివైజ్ లొకేషన్‌ను గుర్తించే నంబర్ అని మీకు తెల్సిందే.IP అడ్రస్ ఎవరికైనా తెలిస్తే, వారు యూజర్ ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేయవచ్చు.అయితే ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది, ఇది త్వరలో అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ చెప్పుకొచ్చింది.వాట్సాప్ దీన్ని ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల్లో పరీక్షిస్తోంది.

గతంలో ఆండ్రాయిడ్ యాప్‌లో ( Android app )దీన్ని టెస్ట్ చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.కాగా ఇప్పుడు iOS వాట్సాప్ బీటా 23.20.1.73 అప్‌డేట్‌లో ఈ కొత్త ఆప్షన్ కనిపించినట్లు వెల్లడించింది.

Telugu Chat, Latest, Ups, Whatsapp-Latest News - Telugu

ఇకపోతే ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేయడానికి వాట్సాప్‌లోని ప్రైవసీ సెట్టింగ్స్‌ కు వెళ్లి “ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్” అనే ఆప్షన్‌ను ఆన్ చేస్తే సరిపోతుంది.తరువాత ఇది కాల్స్‌ ను మరింత సెక్యూర్‌గా మారుస్తుంది.అయితే ఇక్కడ కాల్స్ చాలా స్లోగా లేదా తక్కువ క్లారిటీతో వినిపిస్తాయి.

ఎందుకంటే కాల్స్‌ అవతలి వ్యక్తికి చేరే ముందు వాట్సాప్ సర్వర్‌ల ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి.ప్రైవసీ లేదా కాల్ క్వాలిటీ ఈ రెండింటిలో ప్రైవసీ కావాలనుకుంటే కొత్త ఫీచర్ ఆన్ చేస్తే సరిపోతుంది.

క్వాలిటీ కాల్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఫీచర్‌ను టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube