సోషల్ మీడియా( Social media ) నేడు ఎంతోమంది ఔత్సాహికులకు వేదిక అవుతుంది.ఈ క్రమంలో ఎవరికి నచ్చిన పనిని వారు చేస్తూ ఒకరిపైన ఆధారపడకుండా తమ సొంత కాళ్లపైన నిలబడి రెండు చేతులానిండా దండిగా సంపాదిస్తున్నారు.
ఇటీవల కాలంలో చూసుకుంటే యూట్యూబ్( Youtube )లో రకరకాల వైరైటీ వీడియోలు చేస్తూ క్రేజ్ తోపాటు పేరు కూడా సంపాదించుకుంటున్నారు.అయితే కొంతమంది దానికోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి లైవ్ వీడియోలు చేస్తూ ఆహుతులను ఆశ్చర్య పరుస్తున్నారు.
ప్రస్తుతం అలాంటి రకానికి చెందిన వీడియో ఒకటి యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.

ఇక్కడొక యూట్యూబర్ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అంటూ ప్రేక్షకులను ఆకట్టుకోబోయి అతడే మతితప్పి పడిపోయే పరిస్థితికి కొనితెచ్చుకున్నాడు.ఇంతకీ ఆ యూట్యూబర్ చేసిన ప్రయోగం ఏంటంటే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం.అంటే జంబో రేంజ్లో టూత్ పేస్ట్ లాంటి నురుగు పదార్థాన్ని తయారు చేయడం అన్నమాట.
ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయకపోతే ఆ రసాయనాలు రియాక్షన్ ఇచ్చి వికటించి మొదటికే మోసం వస్తుంది.అయితే మనోడు అంత తెలివితక్కువోడు మాత్రం కాదు.చేసిన ప్రతిదీ నిపుణుల పర్యవేక్షణలోనే చేశాడు.అంతేకాకుండా జనాలకు ఇలాంటివి చేయకూడదని వేదాలు వల్లిస్తూ మరీ వీడియో స్టార్ట్ చేశాడు.

లైవ్‌లో ఆ వింత ప్రయోగాన్ని చేసినపుడు నురగలు కక్కుతూ పేస్ట్ వస్తూ వుండడం వలన ఓ విధమైన పొగ ఆ ప్రదేశం అంతా ఆవిరించింది.అదే సమయానికి అగ్నిమాక సిబ్బంది రంగంలోకి దిగి ఆ యూట్యూబర్‌ని కెమరామెన్ని వెంటనే ఆ గది నుంచి బయటకు తీసుకురావడంతో మనోడు ఊపిరి పీల్చుకున్నాడు.లేదంటే ప్రాణాలు గాల్లోనే హరీ అనేవి.ఆ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అనేది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ.ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్( Hydrogen peroxide ), డ్రై ఈస్ట్, డిష్ సోప్ కలవగానే ఒక విధమైన నురుగు పదార్థాన్ని సృష్టిస్తారు.చూస్తే ఎక్కువ మొత్తంలో ఊహించని రేంజ్లో ఆ నురుగు వస్తుంది కాబట్టి దీన్ని ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అని పిలుస్తున్నారన్నమాట.
మీరు పొరపాటున ఇలాంటివి ఇళ్లదగ్గర ట్రై చేయకండి!







