పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ రెమెడీతో జుట్టును ఒత్తుగా సిల్కీ గా మార్చుకోవచ్చు.. తెలుసా?

జుట్టు ఒత్తుగా మరియు సిల్కీగా( Thick and Silky Hair ) మెరిసిపోతూ కనిపిస్తుంటే అందం మరింత రెట్టింపు అవుతుంది.అందుకే ప్రతి ఒక్కరూ అలాంటి హెయిర్ కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.

 How To Get Thick And Silky Hair At Home!, Thick Hair, Silky Hair, Hair Care, Hai-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే ఖరీదైన షాంపూ, కండిషనర్, ఆయిల్, సీరం వంటివి వాడడమే కాకుండా నెలకు ఒకసారైనా సెలూన్ కు వెళ్లి జుట్టు కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీతో జుట్టును ఒత్తుగా మరియు సిల్కీ గా మార్చుకోవచ్చు.

మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Remedy, Long, Silky, Smooth, Thick-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multani Mitti ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.చివరిగా ఒకటిన్నర గ్లాసు బియ్యం కడిగిన నీళ్లు వేసుకుని మరోసారి కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా షాంపూ చేసుకుంటే బోలెడు ప్రయోజనాలు పొందుతారు.

ముఖ్యంగా ముల్తానీ మట్టి మరియు రైస్ వాటర్ హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తాయి.అలాగే స్కాల్ప్ ను హెల్తీ గా, క్లీన్ గా మారుస్తాయి.

చుండ్రు( Dandruff )ను పూర్తిగా నివారిస్తాయి.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తాయి.

Telugu Care, Care Tips, Remedy, Long, Silky, Smooth, Thick-Telugu Health

ఇక అలోవెరా జెల్ మీ జుట్టును సిల్కీగా మార్చడానికి ఎంతో ఉత్త‌మంగా సహాయపడుతుంది.అలాగే జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలకు సైతం అలోవెరా జెల్‌ అడ్డుకట్ట వేస్తుంది.కాబట్టి ఇంట్లోనే సులభంగా ఒత్తైన సిల్కీ హెయిర్( Silky Hair ) ను పొందాలని కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.మంచి రిజ‌ల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube