మీ వాట్సాప్ చాట్ భద్రంగా ఉంచుకోవాలా.. చేయండిలా..

ఎప్పటికప్పుడు తన యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను వాట్సాప్( Whatsapp ) తీసుకొస్తోంది.ఇలా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎందరినో ఆకట్టుకుంటోంది.

 Whatsapp Web Beta Gets A Screen Lock Feature To Enhance Privacy Details, Whatsap-TeluguStop.com

అయితే ఆఫీసులో వాట్సాప్ వెబ్ వాడే సమయంలో ఒక్కోసారి ఉద్యోగులు బయటికి వెళ్తుంటారు.ఆ సమయంలో వారి వాట్సాప్ చాట్( Whatsapp Chat ) ఎవరికీ చూడకుండా గోప్యంగా ఉంచుకోవాలనుకుంటారు.

దీని కోసం వాట్సాప్ వెబ్ వెంటనే సైన్ అవుట్ చేసి వెళ్లి పోతుంటారు.తిరిగి వచ్చిన తర్వాత సైన్ ఇన్ చేసి తిరిగి వాడుతుంటారు.

ఒక్కోసారి ఇలా సైన్ ఇన్, సైన్ అవుట్ చేసే సందర్భంలో సమయం ఎక్కువ పడుతుంది.దీని వల్ల చికాకు తలెత్తుతుంది.ఇదే కాకుండా వాట్సాప్ చాట్‌ను కొందరు సీక్రెట్‌గా ఉంచాలని భావిస్తుంటారు.ఈ నేపథ్యంలో వాట్సాప్ తన వెబ్ వెర్షన్‌లో త్వరలో కొత్త ఫీచర్లను జోడించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ఫీచర్‌ను స్క్రీన్ లాక్( Screen Lock ) అని పిలుస్తారు.ఈ ఫీచర్ యొక్క ఉద్దేశ్యం యూజర్ల గోప్యతను కాపాడడం, దానిని సురక్షితంగా ఉంచడం.

Telugu Chat Privacy, Enhance Privacy, Latest, Screen Lock, Tech, Whatsapp, Whats

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో తెలియజేయడానికి వాట్సాప్ బీటా ఇన్ఫో ఇటీవల ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.చిత్రంలో చూసినట్లుగా, స్క్రీన్ లాక్ కారణంగా వాట్సాప్ వెబ్( Whatsapp Web ) లాక్ చేయబడింది.ఈ ఫీచర్ మీ పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌‌లలో వాడితే మీ వాట్సాప్ చాట్ ఎంతో సురక్షితంగా ఉంటుంది.వాట్సాప్ వెబ్ అన్‌లాక్ చేయడానికి మీకు పాస్‌వర్డ్ అవసరం.

అంతేకాకుండా వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం వ్యక్తులు పాస్‌వర్డ్‌కు ప్రాంప్ట్ చేయబడిన సమయాన్ని ఎంచుకోవడం ద్వారా స్క్రీన్ లాక్‌ని కాన్ఫిగర్ చేయవచ్చు.

Telugu Chat Privacy, Enhance Privacy, Latest, Screen Lock, Tech, Whatsapp, Whats

యూజర్లు పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, వారు వాట్సాప్ వెబ్‌ను తెరవడానికి ఇప్పటికే ఉన్న ఫీచర్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా సైన్ ఇన్ చేయవచ్చు.వాట్సాప్ స్క్రీన్ లాక్ ఇలా చేయొచ్చు.దీని కోసం వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి మీ అకౌంట్‌కు సంబంధించి సెట్టింగ్‌లకు వెళ్లండి.

యాక్టివేట్ చేసినప్పుడు, మీకు ఇక్కడ స్క్రీన్ లాక్ ఎంట్రీ పాయింట్ కనిపిస్తుంది.సిస్టమ్‌కు దూరంగా ఉన్నప్పుడు ఈ ఫీచర్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఇది త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube