2020లో తెలంగాణ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే?

తెలంగాణలో 2020 లో టీఆర్ఎస్ ప్రభుత్వo కొంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నదనే చెప్ప్పవచ్చు.ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభం ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ లా మారిన పరిస్థితి ఉంది.

 What Will The Telangana Government Administration Look Like In 2020?- Kcr, Coron-TeluguStop.com

అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడం, ప్రభుత్వ ఖజానా లోటు, ఇటు అన్ని రకాల సంస్థల కార్యకలాపాలు నిలిచిపోవడం,ప్రజలకు ఆర్థిక సమస్యలు ఇలా ఛాలెంజ్ లను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందనే చెప్పవచ్చు.కరోనా తీవ్రతను అంచనా వేయడంలో కొంత ఆలస్యం చేసినప్పటికీ చివరికి పకడ్బందీ చర్యలతో కరోనా తీవ్రతను అరికట్టగలిగారని చెప్పవచ్చు.

అంతేకాక ఇంత క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగించడంతో ప్రజలకు కరోనా సమయంలో కొంత ఊరట కలిగించింది.

తరువాత దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు,త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నికను కూడా టీఆర్ఎస్ ఎదుర్కోబోతోంది.

కొత్త అప్పులు చేయకుండానే ప్రభుత్వం నవంబర్ నెలను నెట్టుకొచ్చిన పరిస్థితి ఉంది.ఈసారి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేటాయింపుల్లో రాష్ట్రానికి 3,784 కోట్లు ప్రభుత్వానికి సమకూరింది.పన్ను ఆదాయం కూడా నిలకడగా రాణిస్తుండడం, కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదని చెప్పవచ్చు.మొత్తంగా ఎల్ఆర్ఎస్ లాంటి పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, ఈ సంవత్సరంలోనే అతి పెద్ద సంచలన నిర్ణయం రెవిన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం,తహసీల్దార్ లను సబ్ రిజిస్ట్రార్ గా పదోన్నతితో రెవిన్యూ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

ఇక మొత్తంగా చూసుకుంటే కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించి ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం,ఎల్ఆర్ఎస్ లాంటి పథకాలతో కొంత విమర్శల పాలైందని చెప్పవచ్చు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube