బీజేపీ స్కెచ్ అదుర్స్.. కే‌సి‌ఆర్ బెదుర్స్ ?

తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి ఎన్నికల్లో విజయం కోసం, బి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బి‌ఆర్‌ఎస్ ఆశిస్తుంటే.ఈసారి బి‌ఆర్‌ఎస్ ను( BRS ) గద్దె దించి తాము అధికారం చేపట్టాలని చూస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.

 Bjp Using Brs Schemes For Elections Details, Bjp, Brs, Kcr, Telangana Politics,-TeluguStop.com

దీంతో ఈ త్రిముఖ పోరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.అయితే ఈసారి ఎన్నికల్లో విజయం మాదేనని, బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే ( BJP ) అని నిన్న మొన్నటి వరకు కాన్ఫిడెంట్ గా చెబుతూ వచ్చిన కమలనాథులు కర్నాటక ఎన్నికల తరువాత సైలెంట్ అయ్యారు.

ఆ ఎన్నికల్లో ఓటమి ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన బీజేపీ ఆత్మవిశ్వాసాన్ని గట్టిగానే దెబ్బ తీసింది.

Telugu Amith Sha, Bandi Sanjay, Cm Kcr, Dharani, Kishan Reddy, Ktr, Telangana-Po

దాంతో తెలంగాణ విషయంలో ప్రస్తుతం కమలం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది.సరైన విధంగా ప్రజలకు దగ్గరయ్యే ప్లాన్స్ వేస్తోంది.ఆ కోవలోనే తాజాగా బీజేపీ వేసిన మాస్టర్ స్కెచ్.

ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.ఇంతకీ ఆ స్కెచ్ ఏమిటంటే.

బి‌ఆర్‌ఎస్ ను దెబ్బ తీసేందుకు ఆ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలనే తమకు అనుకూలంగా మార్చుకోవడం.కాగా ఇతర పార్టీల ప్రభావాన్ని బీజేపీపై పడకుండా చూసుకునే కమలనాథులు తెలంగాణ విషయంలో ఆ రూల్ ను చేస్తున్నట్లు కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలౌతున్న అన్నీ పథకాలను అలాగే కొనసాగిస్తామని, ధరణి పోర్టల్ లో కొద్దిగా మార్పులు చేస్తామే తప్పా రద్దు చేయబోమని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్( Bandi Sanjay ) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Amith Sha, Bandi Sanjay, Cm Kcr, Dharani, Kishan Reddy, Ktr, Telangana-Po

కాగా మొదటి నుంచి కూడా కే‌సి‌ఆర్ ( KCR ) ప్రవేశ పట్టిన పథకాలపై ఆయన పాలనపై నిప్పులు చెరిగే కమలనాథులు ఇప్పుడు సడన్ గా కే‌సి‌ఆర్ పథకాలకు జై కొట్టడంతో బీజేపీ ఏం స్కెచ్ వేస్తోందనే చర్చ జరుగుతోంది.అయితే విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.కే‌సి‌ఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు అత్యంత సానుకూలంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ కు ఎదురెల్లి గెలవడం అనేది అసాధ్యమే.అందుకే బి‌ఆర్‌ఎస్ దారిలోనే వెళ్ళి ఆ పార్టీని దెబ్బతీసి ప్రజల దృష్టిని బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరి కే‌సి‌ఆర్ ను దెబ్బతీసేందుకు ఆయన పథకాలనే ఆయుధంగా వాడుకుంటున్న బీజేపీ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ ఆ అవుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube