సినిమా తీయాలంటే దాని వెనుక ఎన్నో బాధలు ఇబ్బందులు ఉంటాయి.కేవలం ఒక దర్శకుడు లేదా నిర్మాత, హీరో, హీరోయిన్ కలిస్తే సినిమా అవ్వదు.
సినిమాకు సంబంధించిన 24 శాఖలు సమన్వయంతో పని చేస్తేనే దాని ఔట్పుట్ అద్భుతంగా వస్తుంది.మరి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని, కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత అభిమానుల మెప్పు పొందితే సరి లేదంటే పడిన కష్టమంతా కూడా వృధా అవుతుంది.
సినిమా విడుదల చేయాలన్న కూడా ఎన్నో బాధలు ఉంటాయి.ప్రతి ఏరియాకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు.సినిమా బాగున్నా, లేకపోయినా కొనుక్కోవాల్సి ఉంటుంది.అలా కొనుక్కున్న తర్వాత సినిమా బాగుందంటే కనక వర్షం కురుస్తుంది కానీ ఫ్లాప్ అయిందంటే నిండా మునగాల్సింది డిస్ట్రిబ్యూటర్ మాత్రమే.
ఎవరైనా సినిమా ఫ్లాప్ అవుతుంది అని నీకు తెలిసి కూడా విడుదల చేస్తారా ? కానీ అలా జరిగింది అలా చేసింది మరెవరో కాదు, ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు.
ప్రతి సినిమాని కూడా హిట్ అవుతుందా ? అవ్వదా ? అని ముందే జడ్జి చేసి మరి కొనుక్కుంటారు దిల్ రాజు.అందుకే ఆయన జడ్జిమెంట్ చేశారంటే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మేవారు చాలానే ఉన్నారు.కానీ ఆయన రెండు సినిమాలను ఫ్లాప్ అవుతుంది అని తెలిసినా కూడా విడుదల చేసి డిస్ట్రిబ్యూటర్ లను నిండా ముంచారు.
ఆ సినిమాలు మరి ఏంటో కాదు ప్రభాస్ నటించిన మున్నా అలాగే కార్తి హీరోగా వచ్చిన చెలియా.ఈ రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయి అని తెలిసే విడుదల చేశారు.
కానీ విడుదల చేయడానికి ఒకరోజు ముందే డిస్ట్రిబ్యూటర్స్ కి ఫోన్ చేసి మరి ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరిచే అవకాశం ఉంది కానీ నేనున్నాను అని మర్చిపోకండి అంటూ హామీ ఇచ్చారట.అలా దిల్ రాజు తన సినిమాలు ఫ్లాప్ అని తెలిసి విడుదల చేశారు.