Australia : ఏందయ్యా ఇది.. ఆస్ట్రేలియాలో దొంగ వింత చేష్టలు.. దొంగతనానికి ముందు యోగా!

ఇటీవల ఆస్ట్రేలియాలోని రిచ్‌మండ్‌లో( Richmond, Australia ) ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఓ మహిళ అసాధారణ రీతిలో చోరీకి సిద్ధమవుతూ కెమెరాకు చిక్కింది.

 What Is This In Australia Thief Strange Antics Yoga Before Theft-TeluguStop.com

ఆమె నార్త్ స్ట్రీట్‌లోని ఫిలిప్పాస్ బేకరీలోకి చొరబడే ముందు, కొన్ని స్ట్రెచ్‌లు, యోగా భంగిమలను ప్రదర్శించింది.ఆమె వింత చేష్టలు మార్చి 3వ తేదీ తెల్లవారుజామున బేకరీ సెక్యూరిటీ కెమెరా రికార్డ్ అయ్యాయి.

ముసుగు ధరించని మహిళ తెల్లవారుజామున 3 గంటలకు బేకరీలోకి ప్రవేశించి అనేక వస్తువులను తస్కరించింది.ఆమె బేకర్ బూట్లు, ఐప్యాడ్, వివిధ క్లీనింగ్ ప్రొడక్ట్స్, కొన్ని క్రోసెంట్‌లను కూడా దొంగిలించింది.అయితే ఈ దొంగతనం మెల్‌బోర్న్‌కు( Melbourne ) చెందిన 44 ఏళ్ల మహిళ చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఆపై ఆమెను అరెస్టు చేశారు.ఆమెపై దొంగతనం, దోపిడి సాధనాలను ఉపయోగించిందని కేసులు ఫైల్ చేశారు.

దొంగతనం జరిగిన కొన్ని వారాల తర్వాత సెక్యూరిటీ ఫుటేజీని పంచుకోవాలని బేకరీ నిర్ణయించుకుంది.దొంగతనానికి పాల్పడే ముందు ఆ మహిళ బేకరీ( Woman’s Bakery ) బయట కసరత్తులు చేస్తున్నట్టు వీడియోలో ఉంది.బేకరీ యజమానులు ఈ దొంగ దొంగతనం చేసే ముందు చేసిన యోగా చూసి ఆశ్చర్యపోయారు.

ఈ వీడియో చాలా త్వరగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.దొంగ క్రోసెంట్లను దొంగిలించే ముందు కేలరీలను బర్న్ చేసిందేమో అని ఒక యూజర్ సరదాగా కామెంట్ చేశాడు.

ఈ సంఘటనను హాస్యాస్పదంగా, దిగ్భ్రాంతికి గురిచేసేదిగా వర్ణించారు, ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దీనిని మీరు కూడా చూసేయండి.గతంలో ఇండియాలో కూడా ఇలాంటి వింత దొంగల వీడియోలు వైరల్ అయ్యాయి.ఒక వీడియోలో దొంగ చోరికి ముందు ఆలయంలో దేవుడి విగ్రహానికి పూజలు చేస్తూ నోరెళ్ల బెట్టేలా చేశాడు.

మరో దొంగ క్షమాపణ లేఖ రాసి దేవాలయంలో చోరీకి పాల్పడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube