మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనం గౌరవంగా భావించే వ్యక్తి గురువు. తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తే గురువులు మాత్రం మన అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తారు.వారు చెప్పే పాఠాలు వింటూ మనం ఎదుగుతాము.కేవలం పాఠాలు మాత్రమే కాదు జీవిత పాఠాలను సైతం నేర్పించి ముందుకు నడుపుతారు.అందుకే మనం ఏ స్థాయికి ఎదిగిన మనకు విద్య నేర్పిన గురువులను గుర్తు పెట్టుకుంటాం.
ఇక చదువు కుంటున్నప్పుడు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఫెవరెట్ టీచర్ ఒకరు ఉంటారు.
వారు వేరొక చోటుకు బదిలీ కావడం లేదా రిటైర్ అయిపోయినప్పుడు వారికీ ఘనంగా వీడ్కోలు పలకడానికి చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ వీడియో కోల్ కత్తా కు చెందిన ఒక స్కూల్ లో అని తెలుస్తుంది.
కోల్ కత్తా 24 పరగణా ప్రాంతంలో కటియాహాట్ బీకేఎపి అనే బాలికల స్కూల్ ఉంది.
ఆ పాఠశాలలో సంపా అనే టీచర్ విధులు నిర్వహిస్తుంది.ఆమె అన్నా, ఆమె బోధించే పాఠాలు అన్నా అక్కడ విద్యార్థులకు చాలా ఇష్టం.
ఈ క్రమంలోనే ఆమెకు విద్యార్థులకు మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.దీంతో ఆమెకు విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు.
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈమె ట్రాన్స్ఫర్ అయినా విషయం తెలుసుకున్న విద్యార్థులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఈ క్రమంలోనే తమకు ఎంతో ఇష్టమైన టీచర్ కు వినూత్నంగా వీడ్కోలు పలకాలని భావించారు.ఇందు కోసం విద్యార్థులు టీచర్ కళ్ళకు గంతలు కట్టారు.
ఆ తర్వాత ఆమెను గ్రౌండ్ లోకి తీసుకు వెళ్లి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని రబ్ నే బనాదీ జోడి సినిమా లోని ఒక పాటను ఆలపించారు.
నా కుచ్ మాంగ.
నా కుచ్ పూచా.తుజ్ మే రబ్ దిఖతా హై.మేడం హమ్ క్యా కరే.అంటూ చేతిలో గులాబీ పువ్వులను పట్టుకుని ఏడుస్తూ పాటను పాడారు.దీంతో టీచర్ కూడా కన్నీరు పెట్టుకుంది.ప్రేమగా విద్యార్థులను హత్తుకుంది.ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.ఆ వీడియో మీరు కూడా చూసేయండి.