చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీకి ఆరణి శ్రీనివాసులు ద్రోహం చేశారని ఆరోపించారు.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టారని దుయ్యబట్టారు.అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసులను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు.
ఈ క్రమంలోనే అవసరం అయితే అనర్హత వేటు వేస్తామని వెల్లడించారు.
కాగా వైసీపీలో సీఎం జగన్ తనకు అన్యాయం చేశారని, 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన తనను అవమానించారని ఎమ్మెల్యే ఆరణి( Aarani srinivasulu ) తీవ్ర విమర్శలు చేయడంతో పాటు హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.