వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఆర్ధిక, సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో కీలక పదవుల్లో వున్నారు.
పెద్దలే కాదు భారత సంతతి చిన్నారులు కూడా తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.పలు పోటీల్లో విజేతలుగా నిలవడంతో పాటు ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా కైవసం చేసుకుంటున్నారు.
తాజా ఇండో అమెరికన్ బాలికను ప్రతిష్టాత్మక ‘‘ స్టాక్‌హోమ్ జూనియర్ వాటర్ ప్రైజ్ ’’ వరించింది.నీటిని నిర్విషీకరణ చేసే పరిశోధనకు గాను ఇండియన్-అమెరికన్ బాలిక ఈషానీ ఝాకు ఈ అవార్డు దక్కింది.
స్వీడన్ యువరాణి విక్టోరియా.ఈ మంగళవారం రాజధాని స్టాక్‌హోమ్‌లో వరల్డ్ వాటర్ వీక్‌లో భాగంగా ఆన్లైన్ ద్వారా ఈ అవార్డు విజేతను ప్రకటించారు.
ఈషానీ ఝా.కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో వున్న లిన్బ్రూక్ హైస్కూల్లో చదువుకుంటోంది.ఆమె క్రియాశీల కార్బన్‌ను బయోచార్‌తో భర్తీ చేయడం ద్వారా మంచినీటినీ శుభ్రం చేయడానికి తక్కువ ఖర్చుతో మంచి మార్గాన్ని కనుగొంది.ఇది వాటర్ ఫిల్టర్లను సమర్థవంతంగా చేస్తుంది.
స్టాక్‌హోమ్ జూనియర్ వాటర్ ప్రైజ్ అనేది 15 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలు.నీటి సమస్యలను పరిష్కరించినందుకు గాను బహుకరిస్తారు.
గతంలో భారతదేశ మూలాలున్న ట్రినిడాడ్ బాలిక శకుంతల హరాసింగ్ థిల్స్టెడ్ .వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
తనకు వాటర్ ప్రైజ్ దక్కడం పట్ల ఈషానీ ఝా హర్షం వ్యక్తం చేశారు.ఇది తనకు దక్కిన గౌరవమన్నారు.
అవార్డు జ్యూరీ మాట్లాడుతూ.ప్రపంచవ్యాప్తంగా నీటి కలుషితాలు పెరుగుతున్నాయని ఇలాంటి పరిస్ధితుల్లో స్వచ్ఛమైన తాగునీరు అవసరమని తెలిపింది.

కాగా, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐడబ్ల్యూఐ) 1997లో జిలేమ్ వ్యవస్థాపక భాగస్వామిగా బహుమతిని ఏర్పాటు చేసింది.కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది బహుమతి ప్రదానం ఆన్లైన్ ద్వారా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.