తెలంగాణ ( Telangana ) లో భారీ అంచనాలు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగిన బిజెపి పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమయింది.ఇక వీరి ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ చాలామంది ఈటలనే టార్గెట్ చేస్తున్నారు.
ఈటెల వల్లే బిజెపి పార్టీ పాతాళానికి పడిపోయిందని,ఆయన రావడం పెద్ద శని అంటూ ఇలా సోషల్ మీడియాలో ఆయనపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు.మరీ ముఖ్యంగా రాజేందర్ కి బండి సంజయ్ ( Bandi sanjay ) కి మధ్య పడడం లేదని ఎలక్షన్ టైం నుండే వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని తీసేసి కిషన్ రెడ్డి కి ఆ పదవి ఇవ్వడానికి ప్రధాన కారణం ఈటెల రాజేందర్ అని,ఈటెల రాజేందర్ చెప్పడం వల్లే బండి సంజయ్ ని పదవి నుండి తొలగించారనే వార్తలు వినిపించాయి.
అంతేకాదు ఎప్పుడైతే బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడి గా బాధ్యతల నుండి తప్పించారు.అప్పటినుండి బిజెపి ( BJP ) పార్టీ కిందికి పడిపోతూ వచ్చింది.అయితే బిజెపిలో కీలక నాయకులైన బండి సంజయ్, ఈటెల రాజేందర్,ధర్మపురి అరవింద్,రఘునందన్ రావు వీరందరూ ఎన్నికల్లో ఓడిపోయి అనూహ్యంగా ఇతర నాయకులు గెలిచారు.
ఇక బండి సంజయ్ గనుక అధ్యక్షుడి పదవిలో కొనసాగితే కచ్చితంగా కాంగ్రెస్ ప్లేస్ లో బిజెపి ఉండేదని కానీ ఈటెల రాజేందర్ వల్లే పార్టీ మొత్తం పాతాళానికి పడిపోయింది అని కొంతమంది బండి సంజయ్ అభిమానులు అంటున్నారు.
కానీ ఈటెల రాజేందర్ ( Etela Rajender ) అనుచరులు కూడా అసలు తగ్గడం లేదు.ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం అని తమ కి కావాల్సిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నారు.వాళ్ళెందుకు గెలవలేదని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్,ఈటెల వీరు ముగ్గురు ఓడిపోవడానికి ప్రధాన కారణం బండి సంజయ్ అంటూ ఇలా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల అనుచరుల మధ్య వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.