ప్రముఖ కంపెనీలలో ఒకటైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ వీ గార్డ్( V Guard ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ సంస్థ ఉత్పత్తులకు మార్కెట్ లో ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది.
వీ గార్డ్ అధిపతి పేరు కుచవ్ సెఫ్( Kuchav Sef ) కాగా అతని భార్య షీలా చిట్టిలపల్లి సొంతంగా కెరీర్ విషయంలో ఎదగాలని భావించారు.భర్త వ్యాపారంతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవాలని అనుకున్నారు.
అయితే తన ఆలోచనలను షీలా( sheela ) భర్తతో పంచుకోగా ఇంటినుంచి రూపాయి కూడా వాడవద్దని బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత అద్దె చెల్లించాలనే నిబంధనలు ఎదురయ్యాయి.వస్త్ర వ్యాపారం నిర్వహించాలని భావించిన షీలాకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.కొంత డబ్బులు అప్పుగా తీసుకుని 1995 సంవత్సరంలో షీలా వీస్టార్ ను మొదలుపెట్టారు.అయితే వస్త్ర వ్యాపారంలో నెలలు గడిచినా ఆమెకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు.
షీలా స్వయంగా షాపులకు వెళ్లి చూపించడంతో పాటు తాను ధరించి మార్కెటింగ్ చేయడం వల్ల సేల్స్ పెరిగాయి.ఆ తర్వాత లోదుస్తుల తయారీ రంగంలోకి షీలా ఎంట్రీ ఇచ్చారు.
ఆ సమయంలో పరువు తీసే పనులు చేస్తుందంటూ కొంతమంది షీలాపై ఆమె భర్తకు ఫిర్యాదు చేశారు.షీలా మాత్రం భర్తకు నచ్చజెప్పి కెరీర్ విషయంలో ముందడుగులు వేశారు.
ఆ తర్వాత షీలా షేప్ వేర్, బ్లౌజులు, లెగ్గింగ్స్ ఇలా అన్నీ తయారు చేస్తూ ఇతర దేశాలకు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు.షీలా గతేడాది వ్యాపారం విలువ 540 కోట్ల రూపాయలు.బిజినెస్ ఉమెన్ గా ఎన్నో ఇబ్బందులను ఫేస్ బేసిన షీలా మహిళా వ్యాపారవేత్తలకు తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.షీలా సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
ఇప్పుడు షీలా ఏకంగా 1000 మందికి ఉద్యోగం కల్పించారు.షీలా మంచి మనస్సుకు సైతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు.