విరాట్ కోహ్లీ అభిమానిని అడ్డుకున్న సెక్యూరిటీ... కోహ్లీ తీరుకి సోషల్ మీడియాలో ప్రశంసలు!

విరాట్ కోహ్లీ… పరిచయం అక్కర్లేని పేరు.భారత క్రికెట్ ప్రపంచంలో ఓ ప్రభంజనం.

 Virat Kohli's Fan Was Stopped By Security Kohli's Behavior Is Appreciated On Soc-TeluguStop.com

అతగాడు గ్రీజులో ఉంటే పరుగుల సునామి కురావాల్సిందే.ఇండియన్ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగే వేరు.

స్వదేశంలోనే కాదు.విదేశాల్లో కూడా విరాట్‌కు వీరాభిమానులున్నారు.

ఆసియా కప్‌ సందర్భంగా ఆ విషయం మరోసారి రుజువైంది.కోహ్లీతో మాట్లాడేందుకు, అతడు సంతకం చేసిన జెర్సీని పొందేందుకు పాకిస్థాన్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు ఆసక్తిచూపిన విషయం తెలిసిందే.

ఇంకొందరు అభిమానులు కోహ్లీని కలిసి అతడితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.

అభిమానులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఈ మాజీ కెప్టెన్‌ తాజాగా మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు.

దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో బుధవారం భారత్‌, హాంకాంగ్‌ జట్లు తలపడిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా భారత జట్టు స్టేడియంలోకి వెళుతుండగా.కోహ్లీ వీరాభిమాని అయిన ఓ బాలుడు నిబంధనలు ఉల్లంఘించి అక్కడకు స్పీడుగా దూసుకొచ్చాడు.

అయితే, అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అతడిని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు.

ఇక దీన్ని దూరమునుండి గమనించిన కోహ్లీ.ఆ బాలుడిని వదిలేయాల్సిందిగా సూచించడంతో సెక్యూరిటీ గార్డు అతడిని విడిచిపెట్టాడు.దీంతో కోహ్లీ వద్దకు పరుగున వెళ్లిన బాలుడు.

తాను ఎంతగానో అభిమానించే అతడి వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకొని, సెల్ఫీలు దిగి పండగ చేసుకున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

దీంతో కోహ్లీ చర్య పట్ల అభిమానులు, ఇతరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఆ బాలుడి పట్ల విరాట్‌ ప్రేమగా వ్యవహరించాడని, ఓపిగ్గా ఉన్నాడని ప్రశంసించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube